Monday, December 23, 2024

భారత్ పర్యటించనున్న ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్

- Advertisement -
- Advertisement -

Israel PM
న్యూఢిల్లీ: పరస్పర అవగాహన, సహకారంపై భారత, ఇజ్రాయెల్ సంబంధాలు ఆధారపడి ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో రెండు దేశాల దౌత్యసంబంధాల 30వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ వస్తానని ఆయన తెలిపారు. బెన్నెట్ ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5 వరకు భారత్‌లో పర్యటిస్తారు.
‘భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్ తన మొదటి అధికారిక పర్యటనను 2 ఏప్రిల్ 2022న చేపట్టనున్నారు’ అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News