Monday, December 23, 2024

గాజా సొరంగాల్లోకి సముద్రపు నీరు పంపిస్తున్న ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇజ్రాయెల్ అనుకున్నంతా చేసింది. గాజా సొరంగాల్లో తలదాచుకున్న హమాస్ దళాలను మట్టుబెట్టేందుకు సముద్ర జలాలను విడుదల చేయడం మొదలుపెట్టింది. హమాస్ సభ్యులు సొరంగాల్లోనే చాంబర్లను ఏర్పాటు చేసుకున్నారు. బందీలను కూడా అక్కడే ఉంచారు. భారీయెత్తున ఆయుధ సామగ్రిని కూడా సొరంగాల్లోనే నిల్వ చేశారు. వీరిని బయటకు రప్పించేందుకు పలు విధాలుగా ప్రయత్నించి విఫలమైన ఇజ్రాయెల్, సొరంగాలను నీటితో నింపివేసి, హమాస్ ఉగ్రవాదులను అక్కడే జలసమాధి చేస్తామని హెచ్చరించింది. అయినా హమాస్ దళాలు లొంగకపోవడంతో చివరకు సముద్ర జలాలను సొరంగాల్లోకి పంపించడం మొదలుపెట్టింది. అయితే సొరంగాలను నీటితో నింపేందుకు చాలా రోజులు పడుతుందని అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News