Wednesday, January 22, 2025

రమాదాన్‌లో గాజాలో పోరు నిలిపివేతకు ఇజ్రాయెల్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్ : గాజాలో తీవ్రవాదులు తమ వద్ద ఉన్న బందీలలో కొందరి విడుదలకు ఒక ఒప్పందం కుదిరిన పక్షంలో రానున్న రమాదాన్ ఉపవాస మాసంలో అక్కడ హమాస్‌పై యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్ సుముఖంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ చర్చల ప్రతినిధులు ఒక ఒప్పందం గురించి కృషి చేస్తున్నారు. ఆ ఒప్పందం కింద పాలస్తీనా ఖైదీల విడుదలకు ప్రతిగా హమాస్ డజన్ల కొద్దీ తన నిర్బంధంలో ఉన్న బందీలలో కొందరిని విడుదల చేస్తుంది. ఆ తాత్కాలిక విరామంలో తక్కిన బందీల విడుదలపై సంప్రదింపులు కొనసాగుతాయి. మంగళవారం తెల్లవారు జామున వెలువడిన బైడెన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ నుంచి వెంటనే స్పందన ఏదీ రాలేదు.

సుమారు మార్చి 10న ప్రారంభం కానున్న రమాదాన్ మాసాన్ని కాల్పుల విరమణ ఒప్పందానికి అనధికారిక గడువుగా పరిగణిస్తున్నారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం వచ్చే వారానికల్లా అమలులోకి రాగలదని తాను ఆశిస్తున్నట్లు బైడెన్ సోమవారం తెలిపారు. ‘రమాదాన్ సమీపిస్తోంది. రమాదాన్ సమయంలో పోరుకు దిగరాదని ఇజ్రాయెల్ అంగీకరించింది. బందీలు అందరి విడుదలకు మాకూ వ్యవధి లభించగలదు’ అని బైడెన్ ఎన్‌బిసి కార్యక్రమం ‘నైట్ విత్ సేథ్ మెయర్స్’లో చెప్పారు. అదే సమయంలో యుద్ధాన్ని ముగించాలని బైడెన్ పిలుపు ఇవ్వకపోవడం గమనార్హం. అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దారుణ మారణ కాండ ఆ యుద్ధానికి దారి తీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News