Wednesday, January 22, 2025

గాజాపై దండయాత్రకు సిద్ధమే: ఐడీఎఫ్ చీఫ్

- Advertisement -
- Advertisement -

టెల్‌అవీవ్: ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతోన్న పోరు ప్రస్తుతం తగ్గుముఖం పట్టేలా లేదు. హమాస్ ఉగ్రవాదుల చెరలో బందీలను కాపాడే విషయంలో ఇజ్రాయెల్ కఠినంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో గాజాపై భూతల దాడులకు సిద్ధమైన టెల్ అవీవ్ సరిహద్దు ప్రాంతంలో భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. ఈ నేపథ్యంలో గాజాపై దండయాత్రకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్‌ఫోర్స్ మరోసారి స్పష్టం చేసింది.

గాజాలో చొరబాటుకు సరైన సమయం కోసి వేచి చూస్తున్నామని, దీనికోసం దేశాధినేతలతో సమన్వయంతో పనిచేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ చీఫ్ స్టాఫ్ జనరల్ హెర్జీ హలేవీ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతంలో మీడియాతో మాట్లాడిన ఆయన , శత్రువుపై దాడి చేయడానికి ప్రతి నిముషాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నట్టు తెలిపారు. ఇలా గాజాపై దండయాత్ర అనివార్యమని ఇజ్రాయెల్ భావిస్తున్న తరుణంలో అమెరికా మరోసారి స్పందించింది.

గాజాపై దాడుల విషయంలో ఇజ్రాయెల్ స్వయంగా నిర్ణయాలు తీసుకోగలదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, గాజా వాసులు హమాస్ ఉగ్రవాదుల ఉనికిని తమకు తెలియజేయాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కోరింది. అలా చెప్పినవారికి ప్రైజ్‌మనీ అందజేస్తామని ప్రకటించింది. ఉగ్రవాదుల ఉనికి చెప్పినవారి వివరాలను ఎట్టి పరిస్థితుల లోనూ బహిర్గతం కానివ్వబోమని, చెప్పినవారి ఇంటికి రక్షణ కల్పించే బాధ్యత ఇజ్రాయెల్ తీసుకుంటుందని హామీ ఇచ్చింది. మీరు ప్రశాంతంగా బతకడంతోపాటు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ మానవతా సహాయాన్ని చేయాలని గాజా వాసులను కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News