Friday, February 21, 2025

ఇజ్రాయెల్ బందీల నాలుగు మృతదేహాలు హమాస్ అప్పగింత

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌కు చెందిన బందీల్లో నలుగురి మృతదేహాలను హమాస్ మిలిటెంట్లు గురువారం అప్పగించారు. మృతుల్లో ఒక తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు, మరో బందీ ఉన్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేసినప్పుడు బందీలైన వారిలో వీరు ఉన్నారు. అయితే చాలా కాలం భయంతో ఉంటూ చనిపోయారు. జాతీయ విషాదానికి గుర్తులుగా వీరు మిగిలారు. మృతులు షిరి బిబాస్, ఆమె ఇద్దరు పిల్లలు ఏరియల్, కెఫిర్‌లతోపాటు 83 ఏళ్ల వృద్ధుడు ఓడెడ్ లిఫషిట్జ్ గా గుర్తించారు. బందీయైన సమయంలో కెఫిర్ కు తొమ్మిది నెలల వయసు. అత్యంత పిన్నవయసు బందీ అతడే. ఇజ్రాయెల్ వైమానిక దాడుల సమయంలో ఈ నలుగురినీ వారి రక్షకులతోసహా చంపివేశామని హమాస్ మిలిటెంట్లు వెల్లడించారు. హమాస్ నుంచి ఈ నలుగురి మృతదేహాలను గాజాస్ట్రిప్ నుంచి స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ నిర్ధారించింది.

మృతదేహాలను గుర్తించడానికి ఇజ్రాయెల్ అధికారులు డిఎన్‌ఎ పరీక్ష చేస్తారు. ఈ ప్రక్రియ రెండు రోజులు పడుతుంది. మృతులను అధికారులు గుర్తించిన తరువాత రెడ్‌క్రాస్ కాన్వాయ్ మృతదేహాలను తీసుకుని ఇజ్రాయెల్‌కు వచ్చింది. భారీ సంఖ్యలో సాయుధులైన హమాస్ ఫైటర్లు, ఇతర వర్గాలకు చెందిన మిలిటెంట్లు, దక్షిణ గాజా లోని ఖాన్ యూనిస్ సమీప ప్రదేశంలో మృతదేహాల అప్పగింత సమయంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా హమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది. యుద్ధవిరమణ శాశ్వతం కాకున్నా, ఇజ్రాయెల్ సైన్యాలు పూర్తిగా వైదొలగకున్నా, మిగతా ఇజ్రాయెల్ బందీలను తాము విడిచిపెట్టబోమని హమాస్ హెచ్చరించింది. అయితే బందీలంతా విడుదలైన తరువాత హమాస్ మిలిటరీని, పాలనను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News