Monday, December 23, 2024

గాజాలో దాడి ఆత్మరక్షణకే..

- Advertisement -
- Advertisement -

ది హేగ్ (నెదర్లాండ్స్) : గాజాలో తమ దేశం సాగిస్తున్న దాడులను అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్ పూర్తిగా సమర్ధించుకుంది. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండకు దిగుతోందనే అభిమోగాలు ఇప్పుడు ఐరాస న్యాయస్థానం ముందు విచారణకు వచ్చాయి. ఈ క్రమంలో గాజాలో తాము జరుపుతున్న దాడులు కేవలం తమ ఆత్మరక్షణకే అని , ఈ తమ యుద్ధాన్ని ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ తెలియచేసుకుంది. చట్టబద్ధతతో కూడిన తమ దేశ దాడులను ఊచకోతగా పరిగణించాల్సిన పనిలేదని , నిజానికి హమాస్ ద్వారానే ఇప్పుడు చెపుతోన్న మారణకాండ తమపై సాగిందని, వారిపై ఈ అభియోగాలను ఆపాదించాల్సి ఉందని ఇజ్రయెల్ తన వాదనను విన్పించింది. తమ దేశంపై దక్షిణాఫ్రికా చేసిన ఆరోపణలు కేవలం దురుద్ధేశపూరితంగా ఉన్నాయని ,

ప్రపంచ స్థాయి ఎత్తుపల్లాల దశలో అంతర్జాతీయ కోర్టు ముందుకు వచ్చిన ఈ కేసు విచారణ దశలో తాము తమ చర్యను పూర్తిగా సమర్ధించుకుంటున్నామని ఇజ్రాయెల్ తరఫున ఆ దేశ ప్రముఖ న్యాయసలహాదారు టల్ బెకర్ తెలియచేశారు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన గాజా స్థావరమైన హమాస్ తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడి , వీధులలో అరాచకానికి దిగి, అకృత్యాలు, అమానుషాలకు పాల్పడిందని, 1200 మందిని దారుణంగా చంపివేశారని, 250 మందిని బందీలుగా తీసుకువెళ్లారని, వారిని చిత్రహింసలకు గురి చేశారని, ఈ దశలో తమ దేశం సాగించిన దాడి కేవలం ప్రతిదాడి అవుతుందని, మారణకాండ కాదని, నిజానికి ఈ విధమైన మానవదమనానికి పాల్పడింది ఎవరనేది? ఎవరికి దీనిని ఆపాదించాల్సి ఉందనేది న్యాయస్థానం తేల్చుకోవల్సి ఉందని వాదన విన్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News