Sunday, December 22, 2024

తక్షణ కారిడార్లతో పౌర రక్షణ..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : గాజాస్ట్రిప్‌లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితిపై ఐక్యరాజ్య సమితిలో కీలకమైన భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల ప్రాణాలకు గండం ఏర్పడిన దశలో ఇజ్రాయెల్ హమాస్ పక్షాలు వెంటనే మానవీయకోణంలో వ్యవహరించాల్సి ఉంది. పౌరుల తరలింపు చర్యలకు వీలు కల్పించాలి. గాజాలో తక్షణ మానవీయ సహాయ మార్గాలకు వీలేర్పడాలని పేర్కొంటూ భద్రతా మండలి తీర్మానం ఆమోదించింది. గాజాలో ఇప్పుడు అల్ షిఫా ఆసుపత్రి రణస్థలిగా మారిందనే వార్తల నేపథ్యంలో మండలి హుటాహుటిన సమావేశం అయింది. తీర్మానం వెలువరించింది.

వెంటనే సహాయక చర్యలు, పౌరుల భద్రతకు అవసరం అయిన కారిడార్స్ ఏర్పాటు కావల్సి ఉందని తీర్మానంలో పిలుపు నిచ్చారు. తీర్మానంపై ఓటింగ్ 12/0 ప్రాతిపదికన నెగ్గింది. అయితే అమెరికా, యుకె, రష్యా ఇందులో పాల్గొనలేదు. వెంటనే కారిడార్ల ఏర్పాటు జరగాలనే తీర్మానం తీవ్రతను భద్రతా మండలి తగ్గించింది. ముందు డిమాండ్‌గా పేర్కొన్న ముసాయిదా ప్రతిపాదనను తరువాత కేవలం అప్పీలుగా మార్చారు. తీర్మానంలో బందీల విడుదల గురించి కానీ, ప్రత్యేకించి కాల్పుల విరమణ పాటించాలనే అంశం గురిచి కానీ ప్రస్తావించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News