హమాస్ నుంచి ముగ్గురు ఇజ్రాయెల్ బందీలు విడుదల కాగానే ఇజ్రాయెల్ 300 పాలస్తీనా ఖైదీలను శనివారం విడుదల చేసింది. ఈమేరకు ఇజ్రాయెల్ హమాస్ తమ ఆరో విడత బందీల విడుదలను పూర్తి చేయగలిగారు. ఇప్పుడు విడుదలైన పాలస్తీనా ఖైదీల్లో అహ్మద్ బర్ఘౌతీ (48) అత్యంత ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి. మిలిటెంట్ నాయకుడు, పాలస్తీనా రాజకీయ వేత్త మార్వాన్ బర్ఘౌతీకి అత్యంత సన్నిహితుడు.జనవరి 19న యుద్ధ విరమణ అమలైన దగ్గర నుంచీ రెండు వైపులా ఐదు విడతల బందీల మార్పిడి పూర్తయింది.
యుద్ధ విరమణ సంధి మొదటి దశలో 21 మంది బందీలు, 730 మంది కన్నా ఎక్కువ పాలస్తీనా ఖైదీలు విడుదలయ్యారు. అత్యంత క్లిష్టమైన రెండో దశలో ఒప్పందం పూర్తిగా నెరవేరకపోతే మార్చిలో మళ్లీ యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశా లున్నాయి. ఇంకా బందీలుగా ఉన్న 73 మందిలో ఇజ్రాయెల్ సైనికులతో సహా మిగతా వారంతా దాదాపు అందరూ పురుషులే. అయితే వీరిలో సగానికి సగం మంది చనిపోయారని భావిస్తున్నారు