Saturday, November 23, 2024

హమాస్‌లను భూమిపై కొట్టడం దుర్లభమే

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్ : ఇప్పటివరకూ హమాస్ శక్తులపై నింగి నుంచి శతఘ్నులు, బాంబులతో దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్‌కు ఇప్పుడు భూతల దాడి కష్టం కానుంది. మొత్తం గాజాస్ట్రిప్‌ను దెబ్బతీస్తామని తెలిపిన ఇజ్రాయెల్ సేనలకు గాజాలోని సీక్రెట్ టన్నెల్స్ కొరుకుడుపడని స్థావరాలుగా మారుతాయని యుద్ధ నిపుణులు తెలిపారు. పైన కన్పించే గాజా ఒక్కటైతే , భూ సొరంగ మార్గాలలో మరో గాజా ఉంటుంది. ఇక్కడ హమాస్ మిలిటెంట్లు అన్ని కాలాల్లో భద్రంగా ఉంటూ, తమ కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్నారు. ఈ టన్నెల్స్‌తో ఇజ్రాయెల్ తన ఆయుధపటిమను నష్టపోవల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో దాడి కంటే , వైమానిక గగనతల దాడులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇజ్రాయెల్ సైన్యంలోని నిపుణులు పేర్కొంటున్నారు. అతి తక్కువ విస్తీర్ణంలో, కిక్కిరిసిన జనసాంద్రత ఉండే గాజాస్ట్రిప్ ప్రాంతంలో తాలిబన్లు మ ప్రాబల్యం చాటుకునేందుకు టన్నెల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పటికే ఈ నెట్‌వర్క్‌ను దెబ్బతీసేందుకు రంగంలోకి దిగామని ఇజ్రాయెల్ రక్షణ వర్గాల ప్రతినిది ఒక్కరు తెలిపారు. అయితే ఇది అంత ఈజీ కాదని వారు భావిస్తున్నారు. హమాస్ మిలిటెంట్లు ఎక్కువగా ఈ టన్నెల్స్‌లో ఉంటూ అదును చూసుకుని బయటకు వచ్చి శత్రుపక్షంపై దాడులకు దిగుతూ ఉంటారు. దాదాపు 500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ టన్నెల్స్ వ్యవస్థను గాజామెట్రోగా వ్యవహరించుకుంటారు. గాజా విస్తీర్ణంతో పోలిస్తే ఈ టన్నెల్స్ విస్తీర్ణం ఎంతో విశాలంగా ఉంటుంది. తాము 100 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ వ్యవస్థను దెబ్బతీశామని 2021లో ఇజ్రాయెల్ సేనలు తెలిపాయి.అయితే ఇది మొత్తం టన్నెల్ విస్తీర్ణంలో కేవలం 5 శాతమే. మిగిలినది ఇప్పుడు హమాస్ మిలిటెంట్ల ఆధీనంలోనే ఉంది. హమాస్ బలగాలు ఎక్కువగా నివాసిత భవనాల కిందుగా ఈ టన్నెల్స్‌ను నిర్మించుకున్నాయి.

దీనిని గుర్తించే ఇప్పుడు తాము ఈసారి భవనాల కింద ఉండే టన్నెల్స్‌ను ఎంచుకుని తీవ్రదాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. పైగా హమాస్ తరచూ తమ ప్రాంతంలో మానవీయ సహాయ కార్యక్రమాల పేరిట అందే విదేశీ నిధులను ఈ టన్సెల్స్ నిర్మాణం, తమ శక్తియుక్తులను పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నాయని,ఈ దశలో ఇప్పుడు జరుగుతున్న తమ దాడుల పట్ల మానవతా కోణం తీసుకురావడం వల్ల ఉపయోగం లేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News