Monday, December 23, 2024

ఉగ్రవాదులతో ఇజ్రాయెల్ పోరు.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ నగరంలో ఇజ్రాయెల్ దళాలకు , ఉగ్రమూకలకు సోమవారం జరిగిన పోరులో నలుగురు పాలస్తీనియన్లు హత్యకు గురయ్యారు. మృతుల్లో 15 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. 45 మంది పాలస్తీనియన్లు తీవ్రంగా గాయపడ్డారు. సరిహద్దు లోని పారామిలిటరీ పోలీసులు, సైన్యానికి చెందిన ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇజ్రాయెల్ వైమానిక దళాలు రంగం లోకి దిగడంతో హింస చెలరేగింది.

Also Read: ఘనంగా ఆదిపురుష్ రామ కోటి ఉత్సవం

ఈ ఘర్షణల్లో ఇజ్రాయెల్ మిలిటరీ వాహనం వెళ్లిన తరువాత రోడ్డు పక్కన అమర్చిన బాంబును పాలస్తీనా ఉగ్రవాదులు పేల్చడంతో ఘర్షణ హింసగా మారింది. జెనిన్ నగరంలో ఇజ్రాయెల్ దళాలకు , పాలస్తీనా ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ సైనిక వాహనం దెబ్బతింది. దాంతో హెలికాప్టర్లు సాయుధ ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయని ఇజ్రాయెల్ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News