Sunday, December 22, 2024

ఇజ్రాయెల్‌- హమాస్ యుద్ధం..నలుగురు పాలస్తీనియన్ల బలి

- Advertisement -
- Advertisement -

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడులకు ముగ్గురు టీనేజర్లతోసహా మొత్తం నలుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ప్రపంచ దేశాధినేతలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్చార్చడానికి ఒకవైపు ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు ఇజ్రాయెల్ దూకుడుగా దాడులకు పాల్పడుతోందని పాలస్తీనా అధికార వర్గాలు మంగళవారం ఆరోపించాయి. ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లో అకాబా గ్రామంలో గత రాత్రి ఇజ్రాయెల్ సైనిక దళాలు దాడులు చేశాయని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మృతుల్లో 19 ఏళ్ల వయసు వారు ఇద్దరు, 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారని తెలియజేసింది. ఉత్తరవెస్ట్‌బ్యాంక్‌లో జెనిన్ శరణార్థుల శిబిరం వద్ద ఆర్మీతో ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపుతో భారీ పోరు జరిగిందని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News