Wednesday, January 22, 2025

సెంట్రల్ గాజాలోని స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 30 మంది మృతి

- Advertisement -
- Advertisement -

శనివారం గాజా మరో మారు ఇజ్రాయెల్ దాడులతో వణికింది. శనివారం ఇజ్రాయెల్ సేనలు సెంట్రల్ గాజాలోని డియిర్ అల్ బలాహ్‌లోని ఓ స్కూల్‌పై జరిపిన దాడిలో కనీసం 30 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని పాలస్తీనియా ఆరోగ్య శాఖ అధికారులు నిర్థారించారు. అయితే తాము అక్కడి హమాస్ కమాండో సెంటర్‌పైనే దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ సేనలు తెలిపారు. సెంట్రల్ గాజాలోని ఖాదిజా స్కూల్ కాంపౌండ్‌లో మిలిటెంట్ల స్థావరం ఉందని సమాచారం రాగానే దీనిని లక్షంగా ఎంచుకుని దాడికి దిగినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అక్కడ హమాస్ కమాండ్ సెంటర్ ఉంది. పైగా కంట్రోల్ సెంటర్‌ను కూడా నిర్వహిస్తున్నారని, దీనిని తాము ఉపేక్షించితే తమకు నష్టం వాటిల్లుతుందనే ఈ దాడికి దిగినట్లు అధికారిక ప్రతినిధి ఒక్కరు తెలిపారు.

అయితే గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన ప్రకటనలో ఇజ్రాయెల్ సేనలు జనసమ్మర్థపు ప్రాంతంలోని స్కూల్‌పైనే దాడికి దిగాయని, ఈ క్రమంలో 30 మంది చనిపోగా వందకు పైగా గాయపడ్డారని తెలిపారు. నిర్వాసితులు ఎక్కువగా ఇక్కడ ఉంటున్నారు, భీకర దాడులతో పలువురు దిక్కులేని స్థితికి చేరారని వివరించారు. కాగా ఇప్పుడు ఈ ప్రాంతంలోని అల్ అఖ్సా హాస్పిటల్ వద్ద అంబులెన్స్‌లు సైరన్లు, బాధితుల అరుపులు కేకలు , బంధువుల ఆర్తనాదాలతో పరిస్థితి దారుణంగా మారింది. గాయపడ్డ వారిని చికిత్సకు తరలించారు. ఇక కొందరు అంబులెన్స్‌లు , వాహనాలు అందుబాటులో లేకపోవడంతో కాలినడకనే ఒళ్లంతా గాయాలు, నెత్తుటితో ఆసుపత్రికి తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News