Monday, December 23, 2024

ఇల్లు నేలమట్టమై 76 మంది కుటుంబ సభ్యులు మృతి

- Advertisement -
- Advertisement -

రఫా (గాజాస్ట్రిప్ ) : గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఓ ఉమ్మడి కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఈ కుటుంబ సభ్యులు 76 మంది దుర్మరణం చెందారు. అతిపెద్ద విస్తారిత కుటుంబం నామరూపాల్లేకుండా పోయిదని స్థానిక సహాయక అధికారులు శనివారం తెలిపారు. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భీకరదాడుల క్రమంలో ఈ దారుణం జరిగింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 12వ వారంలోకి ప్రవేశించింది. ఎప్పుడు ముగుస్తుందో , ఇంకా ఎంత మేరకు విస్తరిస్తుందో తెలియని స్థితి ఉంది. శుక్రవారం జరిగిన దాడి ఇన్ని నెలల్లో ఎప్పుడూ జరగని దాడి అని స్ధానిక అధికారి మహమౌద్ బాస్సాల్ తెలిపారు. గాజాలోని పౌర భద్రతా విభాగం ఉన్నతాధికారిగా ఆయన ఉన్నారు. స్థానికంగా ఉండే అల్ ముగ్రబి కుటుంబం పూర్తిగా దెబ్బతింది. ఈ కుటుంబ పెద్దలు 16 మంది చనిపోయారు.

మృతులలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. మృతులలో ఒక్కరిగా గుర్తించిన ఇస్సాం అల్ ముగ్రబీ ఐరాస అభివృద్థి కార్యక్రమ సంస్థలో ఉద్యోగి ఆయన భార్య, ఐదుగురు పిల్లలు కూడా మృతి చెందారు. ఒక్కరోజు క్రితమే ఐరాస ప్రధాన కార్యదర్శి తరఫున వెలువడిన ప్రకటనలో గాజాలో ఇప్పుడు ఏ ఒక్కరు భద్రంగా లేరని, అక్కడికి మానవీయ సాయం అందడం లేదని, అంతటా అడ్డంకులు ఉంటున్నాయని తెలిపారు. గాజాస్ట్రిప్ ప్రాంతంలో పలు ఉమ్మడి కుటుంబాలు ఒకే నివాసంలో ఉండటం తరాల నుంచి సాగుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల క్రమంలో ఈ ఉమ్మడి కుటుంబంలో చనిపోయిన వారి పేర్లను కొంతమేరకే తెలియచేయగలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News