Tuesday, January 21, 2025

డమాస్కస్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

- Advertisement -
- Advertisement -

బీరూట్ : ఇజ్రాయెల్ సైన్యం సిరియాలోని నివాస ప్రాంతాలపై ఆదివారం భీకర విమాన దాడులకు దిగింది. రాజధాని డమాస్కస్ ఇతర ప్రాంతాలలో తెల్లవారుజామున జరిపిన ఈ దాడులలో కనీసం ఐదుగురు చనిపోయ్యారని, పలువురు గాయపడ్డారని సిరియా అధికార మీడియా సానా తెలిపింది. డమాస్కస్ మధ్యప్రాంతంలో తెల్లవారుజామున భారీ శబ్ధాలతో జనం ఉలిక్కిపడ్డారు. డమాస్కస్ చుట్టూ గగనతలంలో చాలా సేపటివరకూ విమానాలతో విధ్వంసకాండ జరిగింది.

ప్రజలు నివసించే ప్రాంతాలనే టార్గెట్‌గా చేసుకుని ఈ దాడులకు దిగినట్లుగా నిర్థారణ అవుతోందని అధికారులు తెలిపారు. మృతులలో ఓ సైనికుడు కూడా ఉన్నారు. 15 మంది పౌరులు గాయపడ్డారు. పలు భవనాలు ఇళ్లు దెబ్బతిన్నాయి. సెంట్రల్ డమాస్కస్‌లో ఓ మధ్యయుగపు కట్టడం విమానం నుంచి కురిసిన బాంబుల ధాటికి దెబ్బతింది. ఇరాన్ మిలిషియా, లెబనాన్ మిలిటెంట్ల సంస్థ హెజ్బోల్లా వర్గీయులను లక్షంగా చేసుకుని వారు నివాసం ఉంటున్నారనే అనుమానాలతో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. ఓ ఇరాన్ స్కూల్‌పై కూడా బాంబులు కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News