Sunday, January 19, 2025

చైనాలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తకు కత్తిపోట్లు

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనాలోని ఇజ్రాయెల్ ఎంబసీసిబ్బందిపై శుక్రవారం దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడిలో ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఒక్కరికి కత్తిపోట్లు తగిలి గాయపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సిబ్బందిపై దాడి ఎంబసీలో కానీ ఆవరణలో కానీ జరగలేదు. అయితే అమెరికా రాయబార కార్యాలయం ఇతర ఎంబసీలు నెలకొని ఉన్న అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలోనే దాడి జరిగినట్లు వెల్లడైంది. హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో చైనాలో ఇజ్రాయెల్ దౌత్యసిబ్బందిపై దాడి తీవ్ర పరిణామాణానికి దారితీసే వీలుంది. దాడి కారణాలు, ఏ విధంగా జరిగిందనేది స్పష్టం కాలేదు.

ఇప్పటివరకూ ఏ సంస్థ కూడా దీనికి బాధ్యత వహించలేదు. అయితే హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగానే ఈ ఘటన జరిగిందని పాలస్తీనియా వర్గాలు తెలిపాయి. జరిగిన పరిణామంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూధులు, ఇజ్రాయిలీలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ చైనా మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ఇప్పటికైతే చైనా ఇప్పటి పశ్చిమాసియా యుద్ధంపై తటస్థంగా ఉంది. కానీ హమాస్‌వైపు మొగ్గుచూపితే ప్రపంచ స్థాయిలో దీని పర్యవసానాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.చైనా తనకున్న మావోయిజపు అనుబంధం , కమ్యూనిస్టు భావజాల నేపథ్యంలో పాలస్తీనియన్ల పట్ల చాలా కాలంగా సంఘీభావం తెలుపుతూ వస్తోంది. పాలస్తీనియ్ల విమోచనోద్యమానికి మద్దతు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News