Friday, December 27, 2024

ఆసుపత్రిపై దాడి 77 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

గాజా ః గురువారం రాత్రి పూట హమాస్ అధీన ప్రాంతంలో ఉన్న అల్ అమల్ ఆసుపత్రిపై భీకర దాడి జరిగింది. ఈ శతఘ్ని దాడులలో 77 మంది వరకూ మృతి చెందారని పాలస్తీనియా రెడ్ క్రెసెంట్ సంస్థ తెలిపింది. ట్యాంకులు, వైమానిక బలగాల సమన్వయంతో ఇజ్రాయెల్ ఈ దాడికి దిగింది. ఇజ్రాయెల్ సైనిక గివాటి బ్రిగేడ్ అత్యంత సమీప టార్గెట్‌గా దీనిపై దాడికి దిగింది. పేరుకే ఇది ఆసుపత్రి అని, కానీ ఇప్పుడు టెర్రరిస్టుల స్థావరం అయిందని, తమ దాడులలో పలువురు హమాస్ సాయుధులు హతులు అయ్యారని ఇజ్రాయెల్ పేర్కొన్నట్లు ఎఎఫ్‌పి వార్తాసంస్థ వార్త వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News