Sunday, December 22, 2024

యుద్ధానికి మించిన భద్రతా వ్యూహం

- Advertisement -
- Advertisement -

టెల్‌అవీవ్ : ఓ వైపు గాజాస్ట్రిప్‌పై భీకర స్థాయిలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు. మరోవైపు హమాస్ నుంచి ఇతర దేశాల నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడుల నడమనే అమెరికా అధ్యక్షులు బైడెన్ వార్‌జోన్‌లో పర్యటించి వెళ్లారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో కలిసి కొద్దిసేపు ఆయన పరస్పర దాడుల ప్రాంతాలకు అతిసమీపంలో ఉండటం కలకలానికి దారితీసింది. అయితే ఇటువంటి వార్‌జోన్లకు అమెరికా అధినేత వెళ్లినప్పుడు ముందుగా సీక్రెట్ సర్వీసెస్ సంస్థ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. క్షిపణి దాడులను కూడా తట్టుకుని నిలిచే విధంగా అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేకమైన బీస్ట్ వాహనాలు ఉంటాయి. అయితే వార్‌జోన్లకు వెళ్లినప్పుడు సాధారణంగా విమానాలలో వెళ్లకుండా ఎవరికి తెలియకుండా అత్యంత గోప్యంగా దేశాధినేత అక్కడికి చేరుకునేందుకు ఏర్పాట్లు జరుగుతాయి.

ఒకవేళ అమెరికా అధ్యక్షులు విమానంలో ఈ ప్రాంతానికి వెళ్లితే అనేక రకాల దాడులను తట్టుకుని తిప్పికొట్టే రీతిలో ఉండే రెండు విమానాలు ప్రెసిడెంట్ విమానాన్ని వెన్నంటి వెళ్లుతాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ వార్‌జోన్‌లోకి బైడెన్ విమానంలో వెళ్లలేదు. రైలుమార్గంలో వెళ్లారా? లేక రోడ్డు మార్గం ద్వారా వెళ్లారా? అనేది స్పష్టం కాలేదు. సాధారణంగా దేశాధినేతలు ఎక్కువగా వార్‌జోన్లలోకి ప్రత్యేకించి వెళ్లడం జరగదు. అయితే బైడెన్ ఇందుకు విరుద్ధంగా వార్‌జోన్‌లో ఉన్న ఉక్రెయిన్ ప్రాంతానికి వెళ్లి అక్కడ జెలెన్‌స్కీని రెండు మూడుసార్లు కలిసి వచ్చారు. భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. ఇప్పుడు నెతన్యాహును సరిహద్దుల్లో పరస్పర దాడులు జరుగుతున్న ప్రాంతంలోనే కలిసి చర్చలు జరిపి తిరిగి టెల్ అవీవ్‌కు అక్కడి నుంచి స్వదేశానికి చేరిన విశేషాన్ని బైడెన్ దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News