Friday, December 27, 2024

ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : గాజాలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ , ఇజ్రాయెల్ తమ రఫా ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉంది. ఈ పట్టణం లోకి యుద్ధ ట్యాంక్‌లతో అడుగుపెట్టిన ఐడీఎఫ్ దళాలు, తాజాగా గాజా వైపున ఉన్న రఫా సరిహద్దు క్రాసింగ్ ను అధీనం లోకి తీసుకున్నాయి. ఈమేరకు ఇజ్రాయెల్ మిలిటరీ మంగళవారం వెల్లడించింది. సోమవారం రాత్రి నుంచి తూర్పు రఫా లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ లక్షిత దాడులు ప్రారంభించింది. ఇందులో 20 మంది హమాస్ మిలిటెంట్లు మరణించినట్టు తెలిపింది.

ఈ ఆపరేషన్‌లో మూడు సొరంగ ప్రాంతాలను కూడా గుర్తించినట్టు పేర్కొంది. అర్ధరాత్రి దాటిన తర్వాత గాజా వైపున ఉన్న రఫా క్రాసింగ్‌ను నియంత్రణ లోకి తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఇక్కడ ఐడీఎఫ్ ట్యాంకులు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ క్రాసింగ్ వద్ద ఇజ్రాయెల్ జెండా ఎగురుతున్నదృశ్యాలు మీడియాలో కనిపించాయి. అయితే దీనిపై స్పందించేందుకు ఐడీఎఫ్ నిరాకరించింది.

ప్రస్తుతం ఈ క్రాసింగ్ వద్ద సేవలన్నీ నిలిచి పోయాయనీ పాలస్తీనా క్రాసింగ్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ తెలిపారు. నిరంతరం బాంబులు పడుతున్నాయని, దీంతో సిబ్బంది ఇక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చిందని అన్నారు. ఇదిలా ఉండగా, గాజాలో 40 రోజుల కాల్పుల విరమణ, 33 మంది బందీల విడుదల, ప్రతిగా భారీ స్థాయిలో పాలస్తీనా ఖైదీల విడుదల ప్రతిపాదనకు హమాస్ సోమవారం అంగీకరించింది. అయితే ఈ ప్రతిపాదన తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని , రఫాపై దాడి కొనసాగిస్తామని టెల్‌అవీవ్ ఉద్ఘాటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News