Saturday, January 18, 2025

ఇజ్రాయెల్ దళంపై అమెరికా ఆంక్షలు?: మండిపడ్డ నెతన్యాహు

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌కు చెందిన నెట్జా యెహుదా బెటాలియన్‌పై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.. వెస్ట్‌బ్యాంక్ లోని పాలస్తీనీయులపై మానవ హక్కుల ఉల్లంఘటనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ యాక్సియోస్ వార్తాసంస్థ శనివారం ఓ కథనం ప్రచురించింది. నెట్టా యెహుదాపై అనేక ఆరోపణలు ఉన్నాయి.

పాలస్తీనా వాసులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డట్టు గతంలో వార్తలు వచ్చాయి. 2022లో 78 ఏళ్ల పాలస్తీనా అమెరికన్ ఒమర్ అసద్ మృతికి వీరే కారణమన్న ఆరోపణలున్నాయి. 2022 డిసెంబరులో వెస్ట్‌బ్యాంక్ నుంచి ఈ దళాన్ని ఇజ్రాయెల్ తరలించింది. కానీ ప్రభుత్వం దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. నాటి నుంచి ఈ దళం ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బెటాలియన్‌పై పలు వివాదాలున్నాయి. అమెరికా ఆంక్షల వార్తలపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఉగ్రవాదులపై పోరాడుతున్న తరుణంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు.

“ఐడీఎఫ్‌పై ఆంక్షలు విధించొద్దు. ఇజ్రాయెల్ పౌరులపై చర్యలను నేను వ్యతిరేకిస్తున్నాను. ఆ దిశగా బైడెన్ కార్యవర్గం లోనూ మాట్లాడుతున్నాను. మా సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతున్నారు. ఈ తరుణంలో ఆంక్షలు విధించడం సరికాదు. అలా చేసినట్లయితే అది అనైతికతం. దీన్ని అడ్డుకోవడానికి యత్నిస్తాం” అంటూ నెతన్యాహు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ జాతీయ భద్రత శాఖ మంత్రి ఇతమార్ బెన్ గవిర్ సైతం ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ దళాలపై ఆంక్షలను రెడ్‌లైన్‌గా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గవద్దని రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌కు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News