Sunday, December 22, 2024

సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ దాడి: 35 మంది మృతి

- Advertisement -
- Advertisement -

డెయిర్ అల్ బలా : సెంట్రల్ గాజాపై ఆదివారం ఇజ్రాయెల్ దాడికి 35 మంది ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. యుద్ధం మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించిన మరునాడే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ యుద్ధం సరిహద్దుల్లో ప్రాంతీయ జ్వాలలను రేపుతోంది. ఎర్రసముద్రంలో షిప్ కంటైనర్‌పై యెమెన్ హోతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను తాము కూల్చివేశామని ఆదివారం అమెరికా మిలిటరీ వెల్లడించింది.

కొన్ని గంటల తరువాత అదే నౌకపై నాలుగు యుద్ధనౌకలు దాడికి పాల్పడగా, అమెరికా దళాలు కాల్పులు జరిపి అనేక మంది సాయుధ దళాలను చంపివేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులకు ఇంతవరకు 21,600 పాలస్తీనియన్లు బలికాగా, 55 వేల మంది తీవ్రంగా గాయపడ్డారని హమాస్ పాలిత ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

మొత్తం 35 మృతదేహాల్లో 13 మృతదేహాలను ఆదివారం స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ డెయిర్ అల్‌బలా లోని అల్ ఆక్సా ఆస్పత్రి అధికార వర్గాలు వివరించాయి. ఇజ్రాయెల్ దాడులపై నిరసిస్తూ నెతన్యాహుకు వ్యతిరేకంగా వేలాది మంది శనివారం నిరసన ప్రదర్శన సాగించారు. హమాస్ బందీలుగా ఇంకా ఉన్న 129 మంది విడుదలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News