Monday, January 20, 2025

ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లు హతం

- Advertisement -
- Advertisement -

గాజా సిటీ : గాజా నగరంలో మంగళవారం ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపుపై ఇజ్రాయెల్ దళాల దాడిలో ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లు హతమయ్యారు. ఈ దాడిలో మొత్తం 13 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. . మృతుల్లో కమాండర్ల భార్యలు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 20 మంది గాయపడ్డారు. మిలిటెంట్లు లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది.

అత్యంత జనసమ్మర్ధం కలిగిన ప్రాంతాల్లో ఈ దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇస్లామిక్ జీహాదీలు ప్రతీకార దాడులు చేయనున్నట్టు ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ వెల్లడించారు. నగరాల్లోని స్కూళ్లు, బీచ్‌లు, జాతీయ రహదార్లను మూసివేయాలని ఆదేశాంచారు. ముగ్గురు మిలిటెంట్లను టార్గెట్ చేసేందుకు పది కేంద్రాలను తమ విమానాలు పేల్చివేశాయని ఇజ్రాయెల్ పేర్కొంది. 6 ఇస్లామిక్ జిహాదీ కేంద్రాలను కూడా ధ్వంసం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News