Wednesday, January 22, 2025

ఖాజా యూనిస్‌లో ఇజ్రాయెల్ దాడి 38 మంది హతం

- Advertisement -
- Advertisement -

ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 38 మంది వ్యక్తులు హతులయ్యారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్, గాజాలో దాడులు ముమ్మరం చేయగా శుక్రవారం ఉదయం ఘటన చోటు చేసుకుంది. కాల్పుల విరమణకు అంతర్జాతీయ ఒత్తిడి, సప్లయిల కొరత గురించిన ఆందోళనలు పెరుగుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. ఇది ఇలా ఉండగా, ఆగ్నేయ లెబనాన్‌లో జర్నలిస్టులు నివసిస్తున్న ఒక ప్రాంగణంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ముగ్గురు మీడియా సిబ్బంది మరణించారని లెబనాన్ ప్రభుత్వ రంగంలోని నేషనల్ న్యూస్ ఏజెన్సీ (ఎన్‌ఎన్‌ఎ) శుక్రవారం తెలియజేసింది.

ఆ ప్రదేశంలో కుప్పకూలిన భవనాలను, ధూళి, శిథిలాల కింద ప్రెస్ అనే ముద్ర ఉన్న కార్లను చూపుతున్న ఫుటేజ్‌ను స్థానిక వార్తా కేంద్రం అల్ జదీద్ ప్రసారం చేసింది. ఆ ప్రదేశంలో వివిధ మీడియా సంస్థలు బాడుగకు తీసుకున్న వసతి గృహాల సముదాయం ఉన్నది. దాడికి ముందు ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి హెచ్చరికనూ జారీ చేయలేదు. శుక్రవారం తెల్లవారు జామున హతులైన జర్నలిస్టుల్లో తమ సిబ్బంది ఇద్దరు కెమెరా ఆపరేటర్ ఘస్సన్ నాజర్, బ్రాడ్‌కాస్ట్ టెక్నీషియన్ మొహమ్మద్ రిదా ఉన్నట్లు బీరుట్ కేంద్రంగా గల అరబ్ వ్యాప్త అల్ మయదీన్ టివి సంస్థ తెలియజేసింది. కాగా, హసబాయాప్రాంతంలో వైమానిక దాడిలో తమ కెమెరా ఆపరేటర్ విస్సమ్ ఖాసిమ్ కూడా మృతి చెందినట్లు లెబనాన్ హెజ్బెల్లా గ్రూప్‌నకు చెందిన మనార్ టివి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News