Sunday, January 19, 2025

ప్రెషర్ స్పీడ్‌ల్లో మార్పు.. ఇస్రో ఇంజిన్ టెస్టు నిలిపివేత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్షను నిలిపివేసింది. ఉన్నట్లుండి , అనూహ్యంగా ఇంజిన్ టర్బైన్ ఒత్తిడి , స్పీడ్ పెరగడంతో టెస్టును నిలిపివేశారు. ఈ పరీక్షను పవర్ హెడ్ టెస్టు ఆర్టికల్ (పిహెచ్‌టిఎ)గా పిలుస్తారు. రెండు రోజుల క్రితం ఈ టెస్టును ఇస్రోకు చెందిన ప్రపుల్సన్ కాంప్లెక్స్ (ఐపిఆర్‌సి)లో నిర్వహించతలపెట్టారు. ఇంజిన్‌కు 2000 కిలోన్యూటాన్ ప్రెషర్ రావడం లక్ష్యం.

దీని వల్ల వాహకనౌకల పరీక్షల దశలో బూస్టర్ దశలలో సరైన రీతిలో ఇంజిన్లు పనిచేసేందుకు వీలేర్పడుతుంది. నిర్ణీత కక్షల్లోకి లాంఛ్‌వెహికల్స్ ద్వారా శాటిలైట్లను చేర్చడం ద్వారా ప్రయోగ విజయవంతం అవుతుంది. అయితే ఇంజిన్ పరీక్ష దశలో భిన్నమైన సంకేతాలు కన్పించడంతో వెంటనేదీనిని నిలిపివేసినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News