Sunday, January 19, 2025

ఇస్రో పుష్పక విజయం

- Advertisement -
- Advertisement -

రాకెట్ల పునర్వినియోగ (రీయూజ్) సాంకేతిక రంగంలో ఇస్రో మరో మైలురాయి విజయం సాధించింది. శుక్రవారం నిర్వహించిన పుష్పక్ ఆర్‌ఎల్ లెక్స్ 02 ల్యాండింగ్ పరీక్ష ద్వారా ఈ ఘనతను చాటుకుంది. కర్నాటకలోని చిత్రదుర్గలో ఉదయం 7 గంటల 10 నిమిషాలకు అక్కడి ఏరోనాటికల్ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం ఈ వరుసలో రెండోది అయింది. గత ఏడాది ఆర్‌ఎల్‌వి లెక్స్ 1ను విజయంతంగా నిర్వహించారు. ఇప్పుడు రెండో పరీక్ష జరిపారు. దీనివల్ల రీ యూజెబుల్ లాంఛ్ వెహికిల్ (ఆర్‌ఎల్‌వి) లేదా పుష్పక్ రెక్కల విమానాన్ని సాధారణ పరిస్థితుల్లోనూ హెలికాప్టర్ నుంచి ప్రయోగించవచ్చు. ఆర్‌ఎల్‌వి ద్వారా ఇకపై ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు మరింత చవక అవుతాయి. పైగా అత్యంత కీలకమైన సాహస విన్యాసాలు ఇందులో ఇమిడి ఉంటాయి. స్వతహసిద్ధంగా ఆర్‌ఎల్‌వి పుష్పక్ రన్‌వేపై దిగడం, ప్రయాణం సాగించడం వంటి క్లిష్టతర అంశాలు ఇమిడి ఉంటాయి.

ఈ క్రమంలో పుష్పక్‌ను భారత వాయుదళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా తీసుకువెళ్లి భూమి నుంచి నాలుగున్నర కిలోమీటర్లు (4.5) ఎత్తు నుంచి విడిచిపెట్టారు. రన్‌వే నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఇది హెలికాప్టర్ నుంచి వెలువడింది. ఈ క్రమంలో పుష్పక్ స్వతహసిద్ధరీతిలో రన్‌వేను సమీపించడం బ్రేక్ పారాచూట్‌ను వినియోగించుకుని ఆగిపోవడం చకచకా జరిగాయి. ఇందులోని గేర్ బ్రేక్స్, నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ వంటి వ్యవస్థలు చక్కగా పనిచేశాయని ఇస్రోకు చెందిన బెంగళూరు ప్రధాన కార్యాలయం అధికారులు ప్రకటన వెలువరించారు. ఇస్రో వాహనాల హైస్పీడ్ ల్యాండింగ్‌ను అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే సమయంలో సరైన విధంగా ఉండేలా చేసుకోవడానికి ఇప్పటి పరీక్ష కీలకమైందని తెలిపారు. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో , నావిగేషన్, కంట్రోలు సిస్టమ్స్ విషయాలలో ఇది సత్తా చాటుకుందని నిర్థారించారు. ఇప్పటి పరీక్షను విజయవంతం చేసినందుకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సైంటిస్టులను, సాంకేతిక సిబ్బందిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News