Thursday, January 23, 2025

ఇక ఇండియా సూర్యా..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : సెప్టెంబర్ మొదటివారంలోనే భారతదేశ మరో విశిష్ట సూర్యమండల ప్రయోగం జరుగుతుంది. ఆదిత్యా ఎల్ 1గా దీనికి ఇప్పటికే నామకరణం చేశారు. చంద్రయాన్ 3 విజయవంతం అయింది. ఇక ఇంతవరకూ ఏ దేశం చేయని ప్రయోగం సూర్యగోళ ప్రయోగాలకు ఇస్రో సిద్ధం అయిందని సంస్థ ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఆదిత్యా 1 ప్రయోగ తేదీని ఖరారు చేయలేదు. కానీ సెప్టెంబర్ ఆరంభంలోనే ఆదిత్య ముందుకు దూసుకువెళ్లుతుందని ప్రకటించారు. పిఎస్‌ఎల్‌వి ద్వారా ఆదిత్యా ఎల్ 1 శాటిలైట్ ప్రయోగం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహిస్తారు. ఆదిత్యా ఎల్ 1 వ్యోమనౌక 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 4 నెలల కాలంలో ఛేదిస్తుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

సూర్యుడి వాతావరణ అధ్యయనం ఈ ఆదిత్యా ఎల్ 1 లక్షం. ఇది అత్యంత విలువైన ప్రాజెక్టు. సంబంధిత ప్రాజెక్టుకు ప్రభుత్వం 2019లోనే దాదాపు 46 మిలియన్ డాలర్ల విలువ మేర నిధిని ఖరారు చేసింది. అయితే దీని వ్యయంపై తాజా అంచనాలను ఇస్రో ఇప్పటికైతే వెలువరించలేదు. సూర్యుడిలోని అంతర్గత పరిణామాలు గురించి ఇప్పటివరకూ నిర్థిష్టరీతిలో ప్రయోగాలు జరగలేదు. సూర్యుడిలోని సౌర తుపానులు, వీటి వల్ల భూమి పర్యావరణంపై పడే ప్రభావం అధ్యయనం చేస్తారు. భూమి సూర్యుడి మధ్య ఉండే లాగ్‌రేంజ్ ప్రాంతపు బిలం వంటి కక్షలో ఆదిత్యా తిష్టవేసుకుని పరీక్షలు నిర్వహిస్తుంది. ఇతరత్రా గురుత్వాకర్షక శక్తి ప్రబావం లేని స్థితికి, రెండు భారీ గ్రహాల పరస్పర గురుత్వాకర్షక శక్తి పరస్పర పోటీ దశలో ఏర్పడే తటస్థ ప్రాంతంలో ఆదిత్యా లాబ్ తిష్టవేసుకుని సూర్యుడిని పరిశీలిస్తుందని సైంటిస్టులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News