Wednesday, January 1, 2025

రోదసిలో ఉపగ్రహాల డాకింగ్‌ను ప్రదర్శించనున్న ఇస్రో

- Advertisement -
- Advertisement -

కక్షలో రోదసినౌక డాకింగ్‌ను, అన్‌డాకింగ్‌ను ప్రదర్శించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం రాత్రి శ్రీహరికోట ప్రయోగ కేంద్రంకక్షలో రోదసినౌక డాకింగ్‌ను, అన్‌డాకింగ్‌ను ప్రదర్శించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం రాత్రి శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నది. దీనితో భారత్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన నాలుగవ దేశం కానున్నది. ఇస్రో పోలార్ ఉపగ్రహ ప్రయోగ నౌక (పిఎస్‌ఎల్‌వి) ఎస్‌డిఎక్స్01, ఎస్‌డిఎక్స్02 ఉపగ్రహాలను 476 కిమీ వృత్తాకార కక్షలోకి చేర్చి,

జనవరి మొదటి వారంలో రోదసి డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్)కు ప్రయత్నిస్తుందని ఇస్రో అధికారులు తెలియజేశారు. ‘రోదసి డాకింగ్‌లో సత్తా చాటగలిగిన దేశాల ప్రత్యేక బృందంలోకి భారత్ చేరికకు ఇది వీలు కలిగిస్తుంది’ అని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. భారత భావి అంతరిక్ష అన్వేషణ పథకాలకు స్పేడెక్స్ మిషన్ ఒక పునాది కావచ్చునని భావిస్తున్నారు. చంద్రగ్రహం నుంచి భూమికి శిలలు, మృత్తిక తీసుకురావడం, ప్రతిపాదిత భారతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రగ్రహం ఉపరితలంపైకి ఒక వ్యోమగామిని దించడం మొదలైనవి ఆ పథకాల్లో ఉన్నాయి. ఇంత వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే రోదసి డాకింగ్ టెక్నాలజీల్లో సత్తా చాటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News