Wednesday, January 22, 2025

తిరుమలలో ఇస్రో పూజలు

- Advertisement -
- Advertisement -

చంద్రయాన్ 3 నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ షార్‌కు చేరారు. బాహుబలి వాహకనౌకను పరిశీలించారు. తరువాత భాస్కరా గెస్ట్‌హౌస్‌కు చేరుకుని శాస్త్రవేత్తలతో ప్రయోగంపై చర్చించారు. చంద్రయాన్ 3 శాటిలైట్ ప్రాజెక్టు డైరెక్టర్ వీరముత్తవేల్, ఎల్‌విఎం 3 పి 4 మిషన్ డైరెక్టర్ ఎస్ మోహన్‌కుమార్, సహాయక డైరెక్టర్ నారాయణన్, వెహికల్ డైరెక్టర్ బిజూస్ థామస్‌తో ప్రయోగం గురించి సమీక్షించారు. ఇస్రో ప్రయోగాలకు ముందు దైవ ప్రార్థనల ఆనవాయితీలో భాగంగా ముందుగా తిరుమలలో వెంకటేశ్వరసామి పూజలు జరిపారు. ఇస్రో బృందం తిరుమలలో దర్శనానికి వెళ్లుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. శ్రీహరికోట సూళ్లురు పేటలోని చెంగాళమ్మ ఆలయాన్ని కూడా సందర్శించారు. ఈ ప్రాంతానికి అమ్మవారుగా వెలుగొందే చెంగాళమ్మను సందర్శించుకుని తాను ఇస్రో ప్రాజెక్టు విజయవంతానికి పూజలు జరిపినట్లు ఆ తరువాత సోమనాథ్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు కోరినట్లు చెప్పారు. స్పేస్ కమిషన్‌కు చెందిన అంతరిక్ష విభాగం ఛైర్మన్ కూడా అయిన ఇస్రో అధినేత చంద్రయాన్ 3 కౌంట్‌డౌన్ ఆరంభం అయిందని, ప్రయోగం శుక్రవారం 2.35కు జరుగుతుందని తెలిపారు. చంద్రయానం శుభారంభం కానుంది. ఆగస్టు 23 నాటికి చంద్రుడి వద్దకు చేరుతుందని చెప్పారు. చంద్రయాన్ 1 ఘన విజయం సాధించిందని, దీనితో పలు సత్ఫలితాలు వెలువడ్డాయని వివరించారు. చంద్రుడిపై జలం ఉందనే విషయాన్ని పసిగట్టినట్లు , దీనితో ఉనికికి అవకాశం ఉంటుందనేది నిర్థారణ అయినట్లు తెలిపారు. తరువాతి రెండో దశలో జల పరిణామం గురించి మరికొంత అధ్యయనం జరిగింది. ఈ దశలో కేవలం సాఫ్ట్‌ల్యాండింగ్ లోపం తప్పితే పలు విధాలుగా శాస్త్రీయ ఫలితాలు వెలువడ్డాయని వివరించారు. చంద్రయాన్ తరువాత ఈ నెలాఖరులో పిఎస్‌ఎల్‌వి ద్వారా వాణిజ్య ఉపగ్రహం పరీక్షిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News