Monday, December 23, 2024

ఇస్రో చీఫ్‌కు ఇండిగో అపూర్వ స్వాగతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ గురువారం ఇండిగో విమానంలో ప్రయాణించినప్పుడు సిబ్బంది నుంచి అపూర్వ గౌరవాదరణ లభించింది. ఆయనను గౌరవిస్తూ సిబ్బంది ప్రత్యేక అనౌన్స్‌మెంట్ చేశారు. “ ఈ రోజు విమానంలో మనతో పాటు ప్రత్యేక వ్యక్తి కూడా ఉన్నారు. మీరు బోర్డులో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు సేవలందించే అవకాశం రావడం విశేషంగా భావిస్తున్నాం. దేశం గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు ” అంటూ ప్రయాణికులంతా చప్పట్లతో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌హోస్టెస్ ఆయనకు ఫుడ్‌ట్రేతోపాటు ఒక గ్రీటింగ్ కార్డును అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News