Monday, December 23, 2024

గగన్‌యాన్ కోసం ఇస్రో పారాచ్యూట్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తిరువనంతపురం కేంద్రంగా గల ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ( విఎస్‌ఎస్‌సి ) గగన్‌యాన్ మిషన్ కోసం రెండు రోజుల పాటు విజయవంతంగా పారాచ్యూట్ పరీక్షలను నిర్వహించింది. చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చి ల్యాబొరేటరీ లో రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (ఆర్‌టిఆర్‌ఎస్) లో ఈ పారాచ్యూట్ పరీక్షలు బుధ, గురువారాలో నిర్వహించినట్టు ఇస్రో ఒక ప్రకటనలో వెల్లడించింది. మానవ సహిత గగన్‌యాన్ మిషన్ ద్వారా సురక్షితంగా వ్యోమగాములను అంతరిక్షం లోకి పంపడానికి తిరిగి తీసుకురాడానికి పారాచ్యూట్‌ల వినియోగం ఎంతో కీలకం. వ్యోమగాముల మోడ్యూల్‌ను స్థిరీకరించడానికి, వ్యోమనౌక వేగాన్ని సురక్షిత స్థాయికి తగ్గించడానికి పారాచ్యూట్‌లు ఉపయోగపడతాయి.

ఏరియల్ డెలివరీ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎడిఆర్‌డిఇ)/ డిఆర్‌డిఒ సమన్వయంతో ఈ పరీక్షలు నిర్వహించినట్టు ఇస్రో వెల్లడించింది. గాలిలో పారాచ్యూట్‌లో సరిగ్గా ముందుకు పొడుచుకు వచ్చి విచ్చుకునేలా పారాచ్యూట్‌లకు మోర్టార్లను అమర్చారు. శంఖాకార రిబ్బన్ టైప్ ఈ పారాచ్యూట్‌లు 5.8 మీటర్ల వ్యాసంతో రూపొందాయి. అవి విచ్చుకునేలా చేసే వ్యవస్థ నియంత్రణలో ఉండేలా తయారు చేశారు. ఇవి విచ్చుకునే సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా పనిచేసేలా పారాచ్యూట్‌ల వ్యవస్థను రూపొందించామని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News