Monday, January 6, 2025

అంతరిక్షంలో అంకురోత్పత్తి..ఇస్రో అద్భుత ఘనత

- Advertisement -
- Advertisement -

ఇటీవల స్పేడెక్స్ ప్రయోగం చేపట్టిన ఇస్రో మరో అద్భుత ఘనత సాధించింది. కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్) పేరిట పీఎఎస్‌ఎల్వీసీ 60 రాకెట్‌లో ఇస్రో ఓ పేలోడ్‌ను అంతరిక్షం లోకి పంపింది. అందులో 8 అలసంద విత్తనాలను ఉంచింది. ప్రయోగం చేపట్టిన తర్వాత నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్టు తాజాగా ఇస్రో వెల్లడించింది. ‘అంతరిక్షంలో జీవం మొలకెత్తింది ’ అంటూ ఎక్స్‌లోరాసుకొచ్చింది. త్వరలో ఆకులు కూడా వస్తాయని పేర్కొంది. ఈ పేలోడ్‌ను ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది.

అంతరిక్షంలో విత్తనం మొలకెత్తే విధానాన్ని పరీక్షించడంతోపాటు రోదసీ లోని వ్యర్థాలను ఒడిసిపట్టే రోబోటిక్ హస్తం , హరిత చోదక వ్యవస్థ లాంటి వినూత్న ఉపకరణాలను కూడా స్పేడెక్స్ మిషన్ సమయంలోఇస్రో అంతరిక్షం లోకి పంపింది. అమిటీ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఏపీఈఎంఎస్ ద్వారా సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర వృద్ధిని పరీక్షించనున్నారు. మొక్కలు గురుత్వాకర్షణ, కాంతి దిశను పసిగడుతున్న తీరు గురించి కొత్త అంశాలను ఈ ప్రయోగం వెలుగులోకి తెస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News