బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) 2022 తొలి ప్రయోగ మిషన్ తాలూకు కౌంట్‌డౌన్ ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైందని అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ ప్రయోగం ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం ఇఓఎస్04 కక్షలోకి వెళ్లడానికి పిఎస్‌ఎల్‌విసి 52లో ఉంది. రెండు చిన్న ఉపగ్రహాలను కూడా మోసుకుపోనున్న పిఎస్‌ఎల్‌వి ప్రయోగం షెడ్యూల్ సోమవారం 05:59కి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో షెడ్యూల్ చేయబడింది.
పిఎస్‌ఎల్‌విసి 52/ఇఓఎస్04 మిషన్: ప్రయోగానికి సంబంధించిన 25 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్ ఆదివారం 04:29 గంటలకు ప్రారంభమైంది” అని ఇస్రో నగర ప్రధాన కార్యాలయం ట్వీట్ చేసింది.
1710 కిలోల బరువు ఉండే భూపరిశీలన ఉపగ్రహం ఇఓఎస్04ని 520 కిమీ. సూర్యుడి సింక్రోనస్ ధ్రువ కక్షలోకి ప్రవేశపెట్టేలా ప్రయోగ వాహకం పిఎస్‌ఎల్‌విసి 52 రూపొందించబడింది. ఇఓఎస్04 అనేది వ్యవసాయం, అటవీ, తోటలు, నేల తేమ, హైడ్రాలజీ, వరద మ్యాపింగ్ వంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితులలో నాణ్యమైన చిత్రాలు అందించేలా రూపొందించబడిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ మిషన్‌లో ఇన్‌స్పైర్‌శాట్1 అనే విద్యార్థి ఉపగ్రహం, ఇస్రో రూపిందించిన టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ శాటిలైట్ ఐఎన్‌ఎస్2టిడిని ప్రయోగించనున్నారు. ఇది పిఎస్‌ఎల్‌వి 54వ వాహకం.