Friday, January 3, 2025

జనవరిలో శ్రీహరికోట నుండి జిఎస్‌ఎల్‌వి 100 వ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి జనవరిలో చేపట్టనున్న జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జిఎస్‌ఎల్‌వి) మిషన్ నూరో ప్రయోగంగా మైలురాయిని సాధిస్తుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మంగళవారం వెల్లడించారు. వచ్చే ఏడాది ప్లాన్ చేసిన అనేక మిషన్‌ల్లో జిఎస్‌ఎల్‌వి ఎన్‌వీఎస్02 ఒకటని ఆయన తెలిపారు. సోమవారం రాత్రి విజయవంతంగా స్పాడెక్స్ మిషన్‌ను 99 వ ప్రయోగంగా విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా సోమనాథ్ ఈ వివరాలు తెలియజేశారు. స్పాడెక్స్ మిషన్‌లో పంపిన రెండు ఉపగ్రహాల డాకింగ్ జనవరి 7 నాటికి పూర్తవుతుందని చెప్పారు. సోమవారం నాటి పిఎస్‌ఎల్‌వి సి 60 మిషన్‌లో రాబోయే రోజుల్లో శాస్త్రవేత్తలు మరెన్నే స్పేస్ డాకింగ్ ప్రయోగాలు చేపడతారన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. పిఎస్‌ఎల్‌వీ సి 60 రాకెట్‌ను సోమవారం రాత్రి 9. 58 గంటల నుంచి 10 గంటలకు రీషెడ్యూల్ చేయడాన్ని ప్రస్తావిస్తూ ఒక కక్ష లోకి వెళ్లే ఉపగ్రహం

ప్రయాణిస్తున్నప్పుడు మరో ఉపగ్రహానికి చాలా దగ్గరగా వస్తుందో లేదో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సంయోగ అధ్యయనం చేస్తారని సోమనాథ్ వివరించారు. ఉపగ్రహాల మధ్య ఏదైనా సామీప్యత ఉన్నట్టు కనుగొంటే ప్రస్తుత ఉపగ్రహాన్ని కొద్దిగా తరలించాల్సి వస్తుందని, ఈ సందర్భంగా ప్రయోగాన్ని ఆలస్యం చేయడం లేదా ముందుగా చేపట్టడం జరుగుతుందని దానివల్ల సామీప్యత ఏర్పడదని పేర్కొన్నారు. 2023 మేలో ఇస్రో జిఎస్‌ఎల్‌వి ఎఫ్12/ఎన్‌విఎస్ 01 రాకెట్‌లో నావిగేషన్ శాటిలైట్‌ను విజయవంతంగా ఉంచగలిగింది. ఈ జిఎస్‌ఎల్‌వి రాకెట్ దాదాపు 2232 కిలోల బరువు ఉన్న ఎన్‌విఎస్ 01 నావిగేషన్ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జిటిఒ)లోకి విజయవంతంగా మోహరించింది. ఎన్‌విఎస్ 01 అనేది నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ సేవల కోసం ఉద్దేశించిన రెండవ తరం ఉపగ్రహాలలో మొదటిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News