తమిళనాడు లోని మహేంద్రగిరి వద్ద ఇస్రో ప్రొపల్సన్ కాంప్లెక్స్ (ఐపిఆర్‌సి) వద్ద స్వల్పకాలిక సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ హాట్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో వెల్లడించింది. గత మార్చి 28న మొదటి క్రయోజెనిక్ ఇంజిన్ హాట్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించగా, ఇది రెండో టెస్ట్. సెమీక్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ కార్యక్రమాన్ని పరీక్షించడంలో ఇదో మైలురాయిగా ఇస్రో అభివర్ణించింది. కేవలం 3.5 నిమిషాల వ్యవధిలోనే ఈ పరీక్ష జరిగిందని పేర్కొంది. అన్ని యాంత్రిక వ్యవస్థలను ఈ సందర్భంగా పరీక్షించడమైందని తెలియజేసింది. ఈ సమయంలో ఇంజిన్ విజయవంతంగా ఇగ్నైట్ అయిందని, 60 శాతం తన పవర్ స్థాయిలో సక్రమంగా నిర్వహించడమైందని తెలిపింది. తక్కువ, ఎక్కువ ఒత్తిడితో టర్బో పంపులు పనిచేయడం, ప్రీబర్నర్, నియంత్రణ వ్యవస్థలు తదితర కీలకమైన వ్యవస్థలను నిర్వహించడం, ఈ పరీక్షలో భాగంగా ఇస్రో వివరించింది.
ఇస్రో సెమీక్రయోజెనిక్ ఇంజిన్ హాట్ టెస్ట్ విజయవంతం
- Advertisement -
- Advertisement -
- Advertisement -