Monday, December 23, 2024

శ్రీహరికోట నుంచి జిఎస్‌ఎల్‌వి-ఎఫ్12ని ప్రయోగించిన ఇస్రో

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జిఎస్‌ఎల్‌వి-ఎఫ్12 సోమవారం విజయవంతంగా నేవిగేషన్ శాటిలైట్ ఎన్‌విఎస్-01ను విజయవంతంగా ప్రయోగించింది. సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.46 గంటలకు ఇస్రో జిఎస్‌ఎల్‌వి రాకెట్ నావిగేషన్ శాటిలైట్ ఎన్‌విఎస్-01ను నింగిలోకి మోసుకెళ్లింది.

సుమారు 2232 కిలోల బరువున్న ఎన్‌విఎస్-01 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే జిఎస్‌ఎల్‌విఎఫ్12 ఉదయం 10.42 గంటలకు ఎన్‌డిఎస్‌సి రెండో లాంచ్ ప్యాడ్ నుంచి బయలుదేరింది. ఇది భారత దేశపు జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(జిఎస్‌ఎల్‌వి) యొక్క 15వ ఫ్లయిట్. స్వదేశీ క్రయో స్టేజ్ 9వ ఫ్లయిట్. జిఎస్‌ఎల్‌విఎఫ్12 ఉపగ్రహం ఎన్‌విఎస్-01ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ఉంచగలదు.

2023 ఫిబ్రవరిలో ఎస్‌ఎస్‌ఎల్‌వి ప్రయోగం తర్వాత ఇది ఇస్రో నాల్గవ ప్రయోగం. మార్చిలో వన్‌వెబ్ ఇండియా2 మిషన్, ఏప్రిల్‌లో పిఎస్‌ఎల్‌విసి55 తర్వాత ఇది 2023లో నాల్గవ ప్రయోగం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News