Sunday, April 6, 2025

రెండు సింగపూర్ ఉపగ్రహాలతో నింగికెగిరిన ఇస్రో పిఎస్‌ఎల్‌వి రాకెట్!

- Advertisement -
- Advertisement -

చెన్నై: రెండు సింగపూర్ ఉపగ్రహాలు, ఏడు నాన్-సపరేటింగ్ ఇండియన్ పేలోడ్స్‌తో ఇస్రో పిఎస్‌ఎల్‌వి రాకెట్ శనివారం శ్రీహరికోట నుంని నింగికి ఎగిరింది. అంతరిక్ష కేంద్రం మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) ప్రత్యేక వాణిజ్య మిషన్‌కు సంబందించిన పిఎస్‌ఎల్‌విసి55 మధ్యాహ్నం 2.19 గంటలకు నింగిలోకి దూసుకుపోయింది. ఇది టెలియోస్-2, లుమ్లైట్-4, సింగపూర్ ఉపగ్రహాలు, ఏడు నాన్‌సపరేటింగ్ పోయెమ్-2 పేలోడ్స్…అంటే ఏరిస్-2, పైలట్, అర్కా-200, స్ట్రాబెర్రీ, డిఎస్‌ఒఎల్, డిఎస్‌ఒడి-3యు, డిఎస్‌ఒడి-6యులను తనతో మోసుకెళ్లింది.
పిఎస్‌ఎల్‌విసి-55 మిషన్ పిఎస్-4 దశను ఉపయోగించుకుని కక్షలో శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించనున్నదని ఇస్రో తెలిపింది. ప్రయోగాలకు వేదికగా ఉపగ్రహ విభజన తర్వాత పిఎస్-4 ఉపయోగించడం ఇది మూడోసారి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News