Thursday, January 23, 2025

విజయవంతంగా సి54 ప్రయోగం…నింగిలోకి 9 ఉపగ్రహాలు

- Advertisement -
- Advertisement -

సూళ్లూరుపేట: శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పిఎస్‌ఎల్‌వి) సి54 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. పిఎస్‌ఎల్‌వి సి54 ద్వారా 9 ఉపగ్రహాలను కక్షలోకి ప్రశేశపెట్టారు. ఈఓఎస్ శాట్6 సహా 8నానో ఉప్రగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టారు. ఓషన్ శాట్ ఉపగ్రహం ద్వారా భూవాతావరణ పరిశీలన, తుపానును గుర్తించడం, వాతావరణంలో తేమ కనుగొనడం, సముద్రాల మీది వాతావరణం అధ్యయనం చేయనున్నారు. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రజ్ఞులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News