శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకే నెలలో రెండు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. ఈనెల 14న చంద్రయాన్‌లో భాగంగా ఎల్‌విఎం3 రాకెట్‌ను చంద్రుని పైకి పంపింది. తాజాగా పీఎస్‌ఎల్‌వీ సీ 56 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ 56 రాకెట్ నింగి లోకి దూసుకెళ్లింది. నాలుగు దశల్లో జరిగిన ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను భూ కక్ష లోకి ప్రవేశ పెట్టింది. ఈ ఏడాది ఇస్రోకు ఇది మూడో వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం.
సిఎస్‌ఎల్‌వీ సీ 56 ద్వారా సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువున్న 7 ఉపగ్రహాలను నింగి లోకి పంపించింది. ఇందులో డీఎస్‌సార్ ప్రధాన శాటిలైట్. ఇది సింగపూర్ ప్రభుత్వం లోని వివిధ ఏజెన్సీలకు ఉపగ్రహ చిత్రాలను తీసి పంపిస్తుంది. తాజా ప్రయోగంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు.
సెప్టెంబర్‌లో మరో పిఎస్‌ఎల్‌వి ప్రయోగం
పీఎస్‌ఎల్‌వీ సీ 56 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని సోమనాథ్ చెప్పారు. ఇదే శ్రేణి లో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామన్నా రు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం ఉంటుందని తెలిపారు. గగన్‌యాన్, ఎస్‌ఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు.