Wednesday, January 22, 2025

ఇవాళ నింగిలోకి పిఎస్ఎల్ వి-సి55

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పిఎస్ఎల్వి-సి55 ఇవాళ మధ్యహ్నాం నింగిలోకి దూసుకెళ్లనుంది.మరో వాణిజ్య ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సర్వం సిద్ధం చేసింది. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్ వి-సి55 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇవాళ మధ్యహ్నాం 2.20 గంటలకు పిఎస్ఎల వి-సి55 ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ నిన్న మధ్యహ్నాం 12.50 గంటలకు ప్రారంభమైంది.

ఈ ప్రక్రియ నిరంతరాయంగా 25.30 గంటలు కొనసాగిన తర్వాత పిఎస్ఎల వి-సి55 నింగిలోకి దూసుకెళ్తుంది. సింగపూర్ కు చెందిన 741 కిలోల టెలియోస్-2 , 16 కిలోల లూమాలైట్-4 ఉపగ్రహలను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం సింగపూర్ భూ పరిశీలనకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. లూమాలైట్-4 ఉపగ్రహాన్ని సింగపూర్ నేషనల్ వర్శిటీ వారు అభివృద్ధి చేశారు.

Also Read: ఇరవై ఏళ్ల తర్వాత చిరుతో చిందెయనున్న శ్రియ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News