Thursday, December 12, 2024

పిఎస్‌ఎల్‌వి సి59 ప్రయోగం సక్సెస్

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీసీ 59 రాకెట్ నింగి లోకి దూసుకెళ్లింది. ఇస్రో చేసిన ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. ప్రోబా3 ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా పంపింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ ప్రోబా 3ని రూపొందించింది. సూర్యుడిపై పరిశోధనలు చేపట్టడమే ఈ ప్రోబా3 లక్షం. ఈ ఉపగ్రహాలు సూర్యకిరణాలపై మరింత లోతుగా అధ్యయనం చేయనున్నాయి. కరో నా పరిశోధనలో ఇబ్బందులను అధిగమించేలా ఈ ఉపగ్రహాలను రూపొందించారు. వాస్తవానికి బుధవారం సాయం త్రం 4.08 గంటలకు ప్రయోగించాల్సిన పీఎస్‌ఎల్వీసి 59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. బుధవారం మధ్యాహ్నం 2.38 గంటలకు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో దీనికి కౌంట్‌డౌన్ మొదలైనప్పటికీ సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగం గురువారానికి వాయిదా పడింది. గురువారం సాయంత్రం 4:12 గంటలకు ఇస్రో ఈ రాకెట్‌ను ప్రయోగించింది. పిఎస్‌ఎల్‌వి సి59 ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష లోకి చేర్చింది.కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ )కు చెందిన ప్రోబా 3 మిషన్ ఈ శాటిలైట్లను ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) సహకారంతో ప్రోబా3ని ప్రయోగించింది.

ప్రోబా 3 మిషన్‌లో రెండు ఉపగ్రహాలు (కరోనాగ్రాఫ్‌స్పేస్ క్రాఫ్ట్, ఆక్యుల్టర్ స్పేస్‌క్రాఫ్ట్) ఉన్నాయి. దాదాపు 550 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘవృత్తాకార కక్షలో చేర్చారు.వీటిని ఒకే కక్షలో ఏర్పాటు చేశారు. ఇది భూమి నుంచి 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడమే ప్రోబా 3 లక్షం. ఆ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమ పద్ధతిలో భూకక్షలో విహరించనున్నాయి. ప్రోబా 3 మిషన్‌లో ప్రయోగించిన ఉపగ్రహాలు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టిస్తాయి. తద్వారా సూర్యుడి బయటి పొర అంటే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఈ జంట ఉపగ్రహాల్లో ఒకటి సూర్యుడిని కనిపించకుండా కృత్రిమ గ్రహణం పరిస్థితి సృష్టిస్తే , మరొకటి కరోనాను నిశితంగా గమనిస్తూ వస్తుంది. ప్రోబా 3 మిషన్ స్పెయిన్, పోలాండ్, బెల్జియం, ఇటలీ , స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కృషి ఫలితం. మిషన్‌లో రెండు ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించారు. ఈ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష లోకి చేరుకోవడం కీలకం. ఎందుకంటే ఒకదానితో మరొకటి సమన్వయం చేసుకుంటూ కరోనాపై అధ్యయనం చేస్తా యి. ఇందులో ఏ ఒక్కటి పని చేయకపోయినా రెండో శాటిలైట్‌కు ఉపయోగం లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో కృత్రిమ సూర్యుడిని స్పష్టించడం వంటి ప్రయోగాలకు కూడా ఈ ఉపగ్రహాలు కీలకం కానున్నాయి.

శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ అభినందనలు
ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ అభినందనలు తెలిపారు. ప్రోబా 3 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష లోకి ప్రవేశ పెట్టినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News