Thursday, January 23, 2025

ఇదిగో..జాబిల్లి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రయాన్ 3 అనుబంధ ల్యాండర్ విక్రమ్ చంద్రుడికి సమీపంలోకి అత్యంత సజావుగా సాగుతోంది. దీని సాంకేతిక పనితీరు బాగుందని బెంగళూరులోని ఇస్రో వర్గాలు శుక్రవారం తెలిపాయి. ల్యాండర్ విక్రమ్‌కు అత్యంత కీలకమైన డిబూస్టింగ్ ప్రక్రియను చేపట్టారు. దీనితో ఇది క్రమేపీ వేగం తగ్గుతూ సాగుతుంది. ఇప్పుడు జరిగిన డిబూస్టింగ్‌తో ల్యాండర్ తన కక్షను 113 కిమీ /157 కిమీ స్థాయిలో తగ్గించుకుంది. ఈ క్రమంలోనే ఈ విక్రమ్ ల్యాండర్ నుంచి భూ కేంద్రానికి చంద్రుడిని అత్యంత సమీపంలో నుంచి తీసిన ఫోటోలను విజయవంతంగా పంపించింది. ల్యాండర్ సజావుగా తిరగడమే కాకుండా అత్యంత కీలకమైన స్థాయిలో తన నిర్ధేశిత పనిని కూడా చేపట్టిందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

ప్రధానమైన ల్యాండర్‌కు చెందిన ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్‌కు ఈ నెల 20వ తేదీన మరో డిబూస్టింగ్ ప్రక్రియ చేపడుతారు. దీనితో చంద్రయాన్ 3 చంద్రుడికి మరింత చేరువ ఘట్టానికి చేరుకుంటుంది. జాబిల్లి దక్షణ ధృవంపై ఈ నెల 23వ తేదీన సజావుగా దిగేందుకు సానుకూలత ఉంది. కాగా చంద్రుడిని అతి దగ్గరి నుంచి తమకు అందిన ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. ఇందులో చంద్రుడిపై ఉండే బిలాల ఫోటోలు ఉన్నాయి. భూమి నుంచి చంద్రుడి వైపు చూస్తే లోయలుగా కన్పించే వాటిని ఇప్పుడు వెలువడ్డ ఫోటోల ద్వారా ఫాబ్రీ, గియోర్డానో బ్రునో, హర్కెబి జెగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News