Monday, December 23, 2024

ఇస్రోకు ఇరకాటం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జోషిమఠ్‌లో భూమి కుంగిపోతున్న పరిస్థితి గురించి ప్రభుత్వ అధికారిక సంస్థలు మీడియాకు ఎటువంటి సమాచారం, గణాంకాలు వివరించరాదని జాతీయ విపత్తు సంస్థ (ఎన్‌డిఎంఎ) శనివారం ఆదేశాలు వెలువరించింది. వీటికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ కుంగుబాటు మరింత ప్రమాదకర స్థితి కి చేరిందని శుక్రవారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమ శాటిలైట్ ఛాయాచిత్రా ల ప్రాతిపదికన సమాచారం వెలువరించింది. కే వలం 12 రోజుల్లో ఈ ప్రాంతం 5.4 సెంటిమీటర్ల మేర కూరుకుపోయిందని తెలిపే ఛాయాచిత్రాలను దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ’కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో సంచలనం సృష్టించారు. ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది.

వెలువరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్‌డిఎంఎ ఘాటుగా స్పందించింది. మీడియాకు సమాచారం అందించడం , లేదా మీడియాతో వివిధ అధికారిక సంస్థలు ఇష్టాగోష్టిగా మాట్లాడటం , కొన్ని సంస్థలు తమకు తాముగా పరిస్థితిపై సొంత ముగింపులకు దిగడం వల్ల ప్రజలలో పెద్ద ఎత్తున అయోమయం ఏర్పడుతోందని సహాయక చర్యల సంస్థ తెలిపింది. పలు ప్రభుత్వ సంస్థలు ఎవరికి వారుగా తమ నుంచి నిర్థారణ లేకుండానే సామాజిక మాధ్యమానికి ఈ అంశంపై వివరణకు దిగుతున్నాయని, దీని వల్ల ఏర్పడే గందరగోళం గురించి ఆయా సంస్థలు పట్టించుకున్నట్లు లేదని సంస్థ తెలిపింది. సొంత వ్యాఖ్యానాలతో స్థానికులు, దేశవ్యాప్తంగా ప్రజలలో భయాందోళనలు నెలకొంటున్నాయని, దీనితో అంతా గందరగోళానికి గురవుతున్నారని, ప్రత్యేకించి తమ సహాయ చర్యల క్రమానికి విఘాతం ఏర్పడుతుందని తెలిపారు.

ఏదో జరుగుతుందనే అభిప్రాయాన్ని రేకెత్తించడం వల్ల ప్రజలలో మానసిక స్థయిర్యం దెబ్బతింటుందని తెలిపారు. మీడియాలో వస్తున్న పలు రకాల వార్తలు, వ్యాఖ్యలు కథనాల అంశాన్ని ఈ మధ్యలో కేంద్ర హోం మంత్రి సారధ్యంలో జరిగిన సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. జోషిమఠ్‌లో నేల పగుళ్లు, కుంగిపోవడం వంటి పరిణామాలపై నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో విశ్లేషణలు చేపట్టింది. ఇస్రో అయినా ఇతర ఏ ప్రభుత్వ సంబంధిత సంస్థ అయినా ఓ వైపు నిపుణుల బృందం అధ్యయనాల దశలో ఈ అంశంపై తమకు తాముగా స్పందించడం మంచి పద్థతి కాదని తెలిపారు. ప్రత్యేకించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు విశ్లేషణలు మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. వాస్తవాలు అన్ని కూడా నిపుణుల బృందం తుది నివేదిక తరువాత వెలుగులోకి వస్తాయని అప్పటివరకూ వేచి చూడటం ఎవరికైనా మంచిదని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇస్రోకు చెందిన కార్టోశాట్ 2 ఎస్ శాటిలైట్ తీసిన ఛాయాచిత్రాలను ఇటీవలే సంస్థకు చెందిన జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వర్గాలు వెలువరించాయి. జోషిమఠ్ అతి తక్కువ సమయంలో అంటే డిసెంబర్ 27 నుంచి జనవరి 8 మధ్యలోనే 5.4 సెంటిమీటర్ల మేర మునిగిందని తెలిపారు.

ఇమేజ్‌లు తీసేసిన ఇస్రో

కేంద్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థ నుంచి అందిన ఆదేశాల మేరకు ఇస్రో వర్గాలు శనివారం తాము ఇంతకు ముందు వెలువరించిన జోషిమఠ్ చాయాచిత్రాలను నెట్ నుంచి తొలిగించాయి. వీటిని తీసివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరింది. ఇటువంటి ఛాయాచిత్రాలతో ఇప్పటికే ఉన్న భయాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్ తెలిపారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని వెంటనే ఇస్రో బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ ఇమేజ్‌లను తమ సైట్ నుంచి తీసివేసింది.

4 కిలోమీటర్ల రోప్ వే సేవలు నిలిపివేత

జోషిమఠ్‌లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో జోషిమఠ్‌కు ఔలికి అనుసంధానం అయిన 4.15 కిలోమీటర్ల పొడవైన రోప్ వే ద్వారా రాకపోకలను నిలిపివేశారు. రోప్‌వే టవర్ నెంబరు 1 వద్ద కూడా పగుళ్లు కన్పించడంతో వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఈ సేవలను నిలిపివేసింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రయాణాలను నిలిపివేసినట్లు ప్రకటించారు. ఛమోలీలోని జోషిమఠ్ నుంచి ఔలికి వెళ్లే రోప్ వే నిలిపివేశామని , జోషిమఠ్‌లో క్రమేపీ పగుళ్లు పెరుగుతూ ఉండటం వల్ల ముప్పు వాటిల్లకుండా ఈ చర్యకు దిగినట్లు రోప్‌వే నిర్వాహకులు దినేష్ భట్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News