Monday, January 6, 2025

పిఎస్‌ఎల్‌విసి 59 ప్రయోగం వాయిదా

- Advertisement -
- Advertisement -

బుధవారం సాయంత్రం 4.08 గంటలకు ప్రయోగించాల్సిన పీఎస్‌ఎల్వీ సీ 59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం 2.38 నిమిషాలకు శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో దీనికి కౌంట్‌డౌన్ మొదలైంది. కాగా ప్రతికూల వాతావరణం కారణంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసి గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై కీలక పరిశోధనలు జరపనున్నారు. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 మిషన్‌ను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతం అయితే మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మనద్వారా ప్రయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News