- Advertisement -
బెంగళూరు: అంతర్జాతీయ వ్యోమగాముల సమాఖ్య(ఐఎఎఫ్) ఉపాధ్యక్షుడిగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త ఎకె అనిల్ కుమార్ ఎన్నికైనట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రి, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్(ఐఎస్‌ట్రాక్)లో అసోసియేక్ డైరెక్టర్‌గా అనిల్ కుమార్ పనిచేస్తున్నారు. 1951లో ఏర్పడిన ఐఎఎఫ్ అంతరిక్ష సలహా సంస్థగా పనిచేస్తోంది. ఇందులో 72 దేశాలకు చెందిన 433 మంది సభ్యులు ఉన్నారు. శాంతియుత ఉపయోగాల కోసం వ్యోమగాములను తయారుచేయడాన్ని ఐఎఎస్ ప్రోత్సహించడమేగాక అంతరిక్షానికి సంబంధించిన వైజ్ఙానిక, సాంకేతిక సమాచారాన్ని పంచుకోవడానికి మద్దతు ఇస్తుందని ఇస్రో తెలిపింది. అనిల్ కుమార్ ఎన్నిక ఇస్రో సాగిస్తున్న అంతరిక్ష పరిశోధనలకు గుర్తింపు మాత్రమే గాక అంతర్జాతీయ పరస్పర సహకారానికి దోహదపడుతుందని ఇస్రో పేర్కొంది.
- Advertisement -