Monday, January 20, 2025

ఇస్రో సైంటిస్టుకు పార్రికర్ అవార్డు

- Advertisement -
- Advertisement -

పనాజీ : ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ మాధవరాజ్ ను గోవా ప్రభుత్వం మనోహర్ పార్రికర్ యువ సైంటిస్టు అవార్డుకు ఎంపిక చేసింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పార్రికర్ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారం ఏర్పాటు చేసిన తరువాత తొలిసారిగా ఈ అవార్డు బహుకరణ వచ్చే నెల 13 వ తేదీన పార్రికర్ జయంతి సందర్భంగా అందచేస్తారు. ఇస్రోకు అనుబంధంగా ఉన్న యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ సైంటిస్టుగా విశేష సేవలు అందిస్తున్న మాధవ్‌రాజ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం ప్రకటించారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంలో ఈ సైంటిస్టు అందించిన సేవలు అమూల్యమని, దీనికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్లు సిఎం వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News