Monday, December 23, 2024

సముద్ర గర్భంలో రామసేతు వంతెన నిజమే: ఇస్రో

- Advertisement -
- Advertisement -

భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని, నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ 2 డేటాను వినియోగించి తమిళనాడు లోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిమీ ఉం డగా, ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని సున్నపురాతితో నిర్మించినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News