Monday, December 23, 2024

పిఎస్ఎల్వీసి-52 రాకేట్ కు కౌంట్ డౌన్ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

నెల్లూరు: ఇస్రో 2022లో తొలి ప్రయోగానికి సిద్ధమైంది. షార్ కేంద్రంలో సోమవారం ఇస్రో పిఎస్ఎల్వీసి-52 రాకేట్ ను నింగిలోకి పంపించనుంది. తాజాగా ఈ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ను ప్రారంభించింది.దీంతో రేపు ఉదయం 5.59గంటలకు ఈ రాకెట్ ను ప్రయోగించనుంది. 25 గంటలపాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. ఈఎస్ఓ-04తోపాటు రెండు ఉపగ్రహాలను ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ ప్రక్రియను ఇస్రో చైర్మన్ సోమనాథ్ పరిశీలిస్తున్నారు. కాగా, ఈ రాకెట్ ద్వారా భూపరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో రోదసిలోకి ప్రవేశపెట్టనుంది. శాటిలైట్ తో వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్, భూమిపై జరిగే మార్పులు, వరదలు వంటి విపత్తుల్లో నాణ్యమైన ఛాయా చిత్రాల ద్వారా సమాచారం కోసం ఈ రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు.

ISRO Set Countdown for PSLV C-52 from Sriharikota

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News