Friday, December 20, 2024

సెప్టెంబర్ 2 ఉ.11.50 గం.

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : సూర్యుడిపై ప్రయోగాల ఆదిత్యా ఎల్ 1 మిషన్‌కు ఇస్రో సంసిద్ధం అయింది. సెప్టెంబర్ 2వ తేదీ ఆదిత్యా ఎల్ 1 ప్రయోగం జరుగుతుందని ఇస్రో సోమవారం ప్రకటించింది. దీనిని అధికారికంగా నిర్థారించింది. యధావిధిగా శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి ఆదిత్యా ప్రయోగం ఉదయం 11.50 గంటలకు జరుగుతుందని తెలిపారు. చంద్రయాన్ 3 విజయం తరువాత సూర్యగోళ ప్రయోగాలకు ఉద్ధేశించిన ఈ సూర్య మండల పరీక్ష ఇస్రోకు మరింతగా విశ్వఖ్యాతిని తెచ్చేందుకు దారితీస్తుంది. ఆదిత్యా ఎల్ 1 వ్యోమనౌక ద్వారా సూర్యుడిలోని బాహ్యవలయం కరోనాను పరిశిలించేందుకు అవసరం అయిన ఏర్పాట్లు చేశారు. తరచూ సూర్యుడిలో తలెత్తే సౌర తుపాన్లు, దీనితో భూ వాతావరణంపై పడే ప్రభావం గురించి అధ్యయనం ఈ ప్రాజెక్టు కీలక లక్షం. సూర్యుడి దరిదాపుల్లోకి వెళ్లడం ఏ స్పేస్‌క్రాఫ్ట్‌నకు వీలుకాదు. అయితే అంతరిక్షం దాటిన తరువాత నెలకొని ఉండే భూమి సూర్యుడి గురుత్వాకర్షక శక్తుల ప్రభావం లేని లాగ్రాంజే పాయింట్‌లో ఆదిత్యా నౌక తిష్టవేసుకుని ప్రయోగాలు నిర్వహిస్తుంది.

ఈ ప్రాంతాల్లోకి వెళ్లితే వ్యోమనౌక తక్కువ ఇంధన వినియోగంతో నిలవగల్గుతుంది. కక్షలో ఉంటుంది. ఇటువంటి ప్రాంతాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గుర్తించింది. ఈ ప్రాంతానికి ప్రఖ్యాత ఇటలీ ఫ్రెంచ్ గణితశాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ లాగ్రాంజే పేరిట ఈ పేరు పెట్టారు. పిఎస్‌ఎల్‌వి సి 57 రాకెటు ద్వారా ఆదిత్యా ఎల్ 1ను కక్షలోకి పంపిస్తారని ఇస్రో వెలువరించిన ప్రకటనలో తెలిపారు. వ్యోమనౌక నెలకొని ఉండే కక్ష వెంబడి సూర్యుడిని అధ్యయనం చేయడం ఈ పరిశోధనల లక్షంగా ఉంది. సూర్యుడి బాహ్యవలయం అయిన కరోనా , ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ పరిస్థితులపై వివిధ వేవ్‌బ్యాండ్స్‌లలో అధ్యయనం చేస్తారు. ఆదిత్యా ఎల్ 1 పూర్తిగా స్వదేశీనిర్మితం అని, జాతీయ సంస్థల తగు విధమైన ప్రాతినిధ్యంతో దీనికి రూపకల్పన చేసినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఎ), ద్వారా అత్యంత కీలకమైన వెల్క్ పేలోడ్ రూపొందింది. దీనితో సూర్యుడి బాహ్యవలయాన్ని చిత్రీకరించేందుకు యత్నిస్తారు. కాగా పుణేకు చెందిన ఆస్ట్రానమి, ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ ద్వారా సోలార్ ఆల్ట్రావయెలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) పేలోడ్‌ను రూపొందించారు. దీనితో సూర్యుడిలోని కాంతిపుంజాల్లోని అపార శక్తిని అంచనావేయడానికి వీలేర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News