Thursday, January 23, 2025

చందమామపై బుడిబుడి అడుగులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రుడిపై నెమ్మదిగా ఆ తరువాత వడివడిగా మన ప్రజ్ఞాన్ రోవర్ నడక ఆరంభం అయింది. చంద్రుడి లోగుట్టు లాగేందుకు చంద్రయాన్ శాటిలైట్‌లో ఇంతవరకూ ఉన్న రోవర్ చంద్రయాన్ సాఫ్ట్ తరువాత కొద్ది సేపటికి ల్యాండర్ నుంచి విడిపోయి తన డ్యూటీలో చేరింది. ఇప్పుడు రోవర్ చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్ల మేర నడకసాగించిందని ఇస్రో కమాండ్ సెంటర్ బెంగళూరు నుంచి తెలిపింది. దీని పేలోడ్స్ అని ఆన్ అయ్యి సవ్యంగా పనిచేస్తున్నాయి. ఎటువంటి డౌట్‌లేకుండా రోవర్ ముందుకు సాగుతోంది అని ప్రకటించారు. చంద్రయాన్ 3 సంబంధిత తాజా వీడియోను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి నెమ్మదిగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి జారుకుంటూ వచ్చిన క్రమం దృశ్యాలు ఈ వీడియోలో పొందుపర్చి ఉన్నాయి. మాడ్యూల్‌లో ల్యాండర్‌కు హత్తుకుని ఉన్న రోవర్ చంద్రుడిపై వాతావరణం సరిగ్గా ఉన్నదీ లేనిదీ గ్రహించుకుని పరిస్థితిని నిర్థారించుకున్న తరువాత ల్యాండర్ నుంచి విడిపోయి బయటకు రావడం, చంద్రుడిపై పరిశోధనలకు సాగడం సన్నివేశాలతో కూడిన వీడియోను శుక్రవారం ఇస్రో వెలువరించింది.

ల్యాండర్‌కు అమర్చి ఉన్న శక్తివంతమైన కెమెరాలతో తీసిన సెల్ఫీఫోటోగా దీనిని పేర్కొన్నారు. 23వ తేదీన చంద్రయాన్ నౌక చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగుతున్న దశలో తొలిసారిగా ఈ వెలువరించిన అంతకు ముందటి వీడియోలో చంద్రుడి ఉపరితలంపై పరిస్థితి ఏ విధంగా ఉందనేది వెల్లడైంది. సాంద్రంగా ఘనీభవ సముద్ర ఉపరితల పరిస్థితి అక్కడ నెలకొని ఉందని తొలి వీడియో తెలిపింది. కాగా కొద్ది సేపటి తరువాత విక్రమ్ నుంచి విడిపోయి రోవర్ ముందుకు కదిలే వైనం రెండో వీడియోలో ఉంది. ఇదీ రోవర్ కదలిక అంటూ ల్యాండర్ సందేశం వెలువరించిన విషయాన్ని పొందుపర్చారు. కాగా ఈ వీడియోల క్రమంలోనే మరో వీడియోను చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 2 దశలో అవశేషంగా ఉన్న ఆర్బిటార్ సంబంధిత శక్తివంతమైన కెమెరా తీసిన చిత్రం పేరిట విడుదల చేసిన వీడియో మరింత సంచలనానికి దారితీసింది. ఈ వీడియోను చంద్రయాన్ 2 ఆర్బిటార్ తీసిందని పేర్కొంటూ చంద్రయాన్ 3ను స్పేలాగా చంద్రయాన్ 2 వెంబడిస్తోందని వ్యాఖ్యానిస్తూ తొలుత చేసిన వ్యాఖ్యలను , అంతకు ముందటి ఫోటోలను ఇస్రోవర్గాలు కొద్ది క్షణాలకే అధికారిక సైట్ నుంచి తీసివేశాయి.

ల్యాండింగ్ తరువాత కొద్ది సేపటికి 26 కిలోల బరువున్న ఆరు చక్రాల రోవర్ బయటకు కదలివచ్చిందని, ఇది అంతకు ముందుటి వరకూ ల్యాండర్ పొట్టకు హత్తుకున్నట్లుగా ఉన్న బేబీగా ఉందని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఇప్పుడు ల్యాండర్, రోవర్‌లు పరిశోధనలకు సిద్ధం అయ్యాయి. నిర్థిష్ట ప్రాంతాలలో సక్రమ వ్యవస్థలతోసవ్యంగా పని సాగుతోందని ఇస్రో శుక్రవారం నాటి ప్రకటనలో తెలిపింది. ల్యాండర్‌కు చెందిన మిగిలిన పేలోడ్స్ ఇల్సా, రాంభా, ఛాస్తే ఇప్పుడు ఆన్ అయ్యాయి. రోవర్ కదలికల ప్రక్రియ ఆరంభం అయింది. అంతా సవ్యంగా సాగుతోందని ఇస్రో కమాండ్ సెంటర్ తెలిపింది. రోవర్‌కు అమర్చి ఉన్న పలు సాంకేతిక పరికరాలు ఇందులోని ప్రక్రియలతో జాబిల్లి ఉపరితలంపై రాళ్ల పరిణామాలు, లవణాల సాంద్రత వంటివి పసికడుతుంది. ఇది ఇస్రోకు విలువైన డేటా అవుతుంది. కాగా ల్యాండర్‌కు రోవర్ నిర్థిష్టరీతిలో ర్యాంప్ ద్వారా అతుక్కుని ఉంటూ వచ్చింది. సోలార్ ప్యానెల్‌తో ఉన్న రోవర్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చేందుకు రెండు ముక్కలుగా ఉన్న ర్యాంప్ ఉపయోగపడింది.

నేడే ఇస్రో సైంటిస్టుల బృందంతో ప్రధాని మోడీ ఇస్ట్రాక్‌లో గంటసేపు అభినందనల కార్యక్రమం
ప్రస్తుత విదేశీ పర్యటన తరువాత ప్రధాని మోడీ బెంగళూరుకు వచ్చి చంద్రయాన్ విజయసారథులైన ఇస్రో బృందాన్ని అభినందిస్తారు. బెంగళూరులోని పీన్యా ప్రాంతంలోని ఇస్రో ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్( ఇస్ట్రాక్) కార్యాలయానికి ప్రధాని మోడీ శనివారం ఉదయం రానున్నట్లు వెల్లడైంది. అయితే ఏ సమయంలో ప్రధాని వచ్చేది స్పష్టం కాలేదు. ఇక్కడ సైంటిస్టులతో సాంకేతిక సిబ్బందితో ప్రధాని ముచ్చటిస్తారు. జాతికి ఘన విజయాన్ని సాధించిపెట్టిన శాస్త్రజ్ఞుల సేవానిరతిని ఈ సందర్భంగా దేశానికి మరోమారు తెలియచేస్తారు. చంద్రయాన్ విజయవంతం అయిన దశలో బుధవారం ప్రధాని మోడీ దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు హాజరీలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన ఇస్రో టీంతో తన స్పందనను పంచుకున్నారు. ప్రధాని మోడీ బెంగళూరు పర్యటన దశలో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రూల్స్‌ను కట్టుదిట్టం చేశారు. కాగా ప్రధాని మోడీకి హెచ్‌ఎల్ ఎయిర్‌పోర్టు, జలహల్లి క్రాస్ వద్ద స్వాగతం పలికేందుకు బిజెపి నేతలు, కార్యకర్తలు సన్నాహాలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News