Wednesday, January 22, 2025

శుక్రగ్రహ పరిశోధనకు ఇస్రో సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

ఇస్రో వీనస్ మిషన్ శుక్రయాన్ 1 రాకెట్‌ను 2024 డిసెంబర్‌లో ప్రయోగించాలని అనుకున్నారు. ఈ ఆలోచన 2012 లోనే మొలకెత్తింది. ఐదేళ్ల తరువాత 201718 బడ్జెట్‌లోఅంతరిక్ష విభాగానికి 23 శాతం ఎక్కువగా కేటాయింపులు జరగడంతో ఇస్రో ప్రాథమిక అధ్యయనాన్ని ప్రారంభించింది. అయితే దీనికోసం పేలోడ్ అంటే రాకెట్‌తోపాటు పరిశోధనకు ఏవేవి అవసరమైనవి తీసుకు వెళ్లాలో ప్రతిపాదనలను పరిశోధన సంస్థ నుంచి ఇస్రో 2017 ఏప్రిల్‌లో ఆకాంక్షించింది. భూమి నుంచి వీనస్‌కు సరైన ప్రయోగాలు చేయాలంటే ప్రతి 19 నెలలకోసారి ప్రయోగాలను సమీక్షించ వలసి ఉంటుంది.

అందువల్ల ప్రయోగ తేదీలను 2026 లేదా 2028 నాటికి ఖరారు చేస్తేనే మంచిదని ఇస్రో సమర్థించింది. ఈ కారణంగా మొదట అనుకున్న 2024 గడువును వదులుకోవలసి వచ్చింది. కానీ ఇంకా సరైన ప్రయోగ ప్రారంభ సమయాలు కావలసి వస్తోంది. దానివల్ల ప్రయోగంలో రాకెట్‌ను పంపడానికి ఇంధనం అవసరాన్ని మరింత తగ్గిస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రయాన్ 1 రాకెట్‌ను వాస్తవానికి 2023 లో ప్రయోగించాలని అనుకున్నామని, కానీ ఇప్పుడు ఆలోచిస్తే 2031 నాటికి ప్రయోగించడానికి సిద్ధం కావడమే మంచిదని ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ ప్రొఫెసర్ పి.శ్రీకుమార్ అభిప్రాయపడ్డారు.

అయితే ఈ మిషన్‌కు నిధులతోపాటు ప్రభుత్వ ఆమోదం అవసరమని పేర్కొన్నారు. అమెరికా, ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థలు కూడా 2031 నాటికి వీనస్ మిషన్లు ప్రయోగించడానికి సిద్ధమవుతున్నాయి. చైనా మాత్రం 2026 లేదా 2027లో ప్రయోగించాలని చూస్తోంది. 2023 మధ్యలో శుక్రయాన్1ని ప్రయోగించాలని ఇస్రో ఆశించినా, కరోనా మహమ్మారి వ్యాపించడంతో 2024 డిసెంబర్‌కు వాయిదా పడింది. అయితే ఇస్రో ఇతర మిషన్లు ఆదిత్య ఎల్ 1, చంద్రయాన్ 111 ప్రయోగాలపై కూడా కరోనా ప్రభావం పడింది. శుక్రయాన్ 1 కూడా ఆర్బిటర్ మిషనే. దీని సైంటిఫిక్ పేలోడ్స్ ప్రస్తుతం హైరిజల్యూషన్ సింథటిక్ ఎపెర్చర్ రాడార్, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్.

శుక్రగ్రహం భౌగోళిక తత్వం, అగ్నిపర్వత విస్ఫోటనాలు, అక్కడి నేల నుంచి వెలువడే ఉత్పాదకతలు, గాలుల వేగం, ఆవరించే మేఘాలు, తదితర గ్రహ లక్షణాలను దీర్ఘ వృత్తాకార కక్ష నుంచి ఈ శుక్రయాన్ 1 మిషన్ అధ్యయనం చేస్తుంది. 202223 బడ్జెట్ నుంచి రూ. 13,700 కోట్లను ఇస్రో పొందగలిగింది. ఈ కేటాయింపు అంతకు ముందు సంవత్సర బడ్జెట్ కేటాయింపుల కన్నా ఎక్కువ. అయితే ఈ నిధుల మొత్తం మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్‌యాన్‌కు మళ్లించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News