ఎల్‌విఎం 3 ఎం6 మిషన్‌కు సంబంధించి క్రయోజెనిక్ హాట్ పరీక్షను విజయవంతంగా నెరవేర్చినట్టు ఇస్రో శనివారం వెల్లడించింది. తమిళనాడు లోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్సులో ఈ పరీక్ష జరిగింది. ఎల్‌విఎం 3 అనేది మూడు దశల మధ్యతరహా రాకెట్ ప్రయోగం. దీన్ని ఇండోస్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో) అభివృద్ధి చేసింది. ప్రతి ప్రయోగం ముందు క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష చేయడం సహజం. అయితే ఇంతవరకు ఈ క్రయోజెనిక్ ఇంజిన్ (సిఇ 20) హాట్ టెస్టులు కాంప్లెక్సు లోని వాక్యూమ్ పరిస్థితుల బట్టి సంక్లిష్ట సంస్థాపనలతో అనుకరించడమౌతోంది. గరిష్టంగా 25 నిమిషాల వ్యవధిలో వీటిని నిర్వహించడం జరుగుతోంది. అయితే ప్రస్తుత పరీక్షలో క్రయెజెనిక్ ఇంజిన్‌ను సుదీర్ఘ 100 నిమిషాల సమయంలో నిర్వహించడం విశేషంగా ఇస్రో వెల్లడించింది. దీనివల్ల అంతరిక్ష ప్రయోగాల్లో క్రయోజెనిక్ దశలు వేగంగా పూర్తి కావడానికి వీలవుతుందని ఇస్రో వెల్లడించింది.
ఎల్‌విఎం3ఎం6 మిషన్..ఇస్రో క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
- Advertisement -
- Advertisement -
- Advertisement -